కాంగ్రెస్ నెగెటివ్ పాలిటిక్స్‌ను ప్రజలు తిరస్కరించారు : శివరాజ్

ABN , First Publish Date - 2020-11-11T00:33:45+05:30 IST

మధ్య ప్రదేశ్ శాసన సభ ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం

కాంగ్రెస్ నెగెటివ్ పాలిటిక్స్‌ను ప్రజలు తిరస్కరించారు : శివరాజ్

భోపాల్ : మధ్య ప్రదేశ్ శాసన సభ ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ చేస్తున్న నెగెటివ్ పాలిటిక్స్‌ను ప్రజలు తిరస్కరించారన్నారు. 


రాష్ట్రంలో 28 శాసన సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 20 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 6 స్థానాల్లోనూ, బీఎస్‌పీ ఒక స్థానంలోనూ ఆధిక్యంలో ఉన్నాయి. 


ఓట్ల లెక్కింపు తీరును పరిశీలించిన శివరాజ్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ చేస్తున్న నెగెటివ్ పాలిటిక్స్‌ను రాష్ట్ర ప్రజలు తిరస్కరించారన్నారు. ఇది ప్రజల విజయమని చెప్పారు. ప్రజలు అభివృద్ధి రాజకీయాలను కోరుకుంటున్నారన్నారు.


ఇదిలావుండగా, ఈ ఉప ఎన్నికలకు చాలా ప్రాధాన్యం ఉంది. శివరాజ్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం మనుగడ కొనసాగాలంటే కనీసం 8 మంది బీజేపీ అభ్యర్థులు గెలవవలసి ఉంది. మరోవైపు పార్టీలో చేరిన యువ నేత జ్యోతిరాదిత్య సింథియా భవితవ్యం కూడా ఈ ఎన్నికల్లో బీజేపీ విజయంపై ఆధారపడింది. సింథియా వర్గం కాంగ్రెస్ నుంచి వైదొలగడంతో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2020-11-11T00:33:45+05:30 IST