పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

ABN , First Publish Date - 2021-02-25T04:05:49+05:30 IST

పౌష్టికాహారం తీసు కుంటేనే ఆరోగ్యంగా ఉంటారని ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ తిరుమల్‌రెడ్డి అన్నారు.

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
గర్భిణితో మాట్లాడుతున్న ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ తిరుమలరెడ్డి

-ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ తిరుమల్‌రెడ్డి 

జైనూరు, ఫిబ్రవరి24: పౌష్టికాహారం తీసు కుంటేనే ఆరోగ్యంగా ఉంటారని ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ తిరుమల్‌రెడ్డి అన్నారు. జైనూరు మండలం శివనూర్‌ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన బుధ వారం తనిఖీ చేశారు.చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్నారా అని  అడిగి తెలుసు కున్నారు. ఐసీడీఎస్‌ కేంద్ర ప్రక్కన పెంట కుప్పలు ఉండడంతో చిన్నారులు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని, వాటిని తొలగించాలని సూచిం చారు. దీంతో పాటు గ్రామంలో నిత్యావసర సరుకుల పంపిణీ గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో వంద మందికి రేషన్‌ కార్డులు లేవని దీంతో బియ్యం రావడం లేదని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. అర్హులైన వారందరికీ సత్వరమే రేషన్‌కార్డులు అందించాలని అక్కడే ఉన్న తహసీల్దార్‌ సాయన్నను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆహార సరఫరా అధికారి కుమారస్వామి, ఆసిఫాబాద్‌ ఆర్డీవో సిడాం దత్తు, డీఆర్‌డీవో ఇన్‌చార్జి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సాయాగౌడ్‌, ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సావిత్రి, జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని తదితరులు హాజరయ్యారు. అనంతరం జైనూరులో డీలర్‌షాపును పరిశీలించారు. 

పాఠశాలను సందర్శించి హాజరు పట్టికను తనిఖీ చేశారు. ఇన్ని రోజులు కొవిడ్‌ కారణంగా పాఠశాల పని చేయలేదని మిగిలి ఉన్న బియ్యం నిల్వల వివరాలను చెప్పాలని హెచ్‌ఎంను కోరారు.  సత్వరమే బియ్యం తెప్పించుకొని మధ్యాహ్న భోజనం అందిస్తామని ఎంఈవో కుడ్మెత సుధాకర్‌ సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో ఇందిర, సిర్పూర్‌(యూ) తహసీల్దార్‌ రహిమొద్దిన్‌, ఏపీడీ శ్రీనివాస్‌, సర్పంచ్‌ రాథోడ్‌ చంద్రకళ, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు పింటుబాయి, సవిత, రజిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-25T04:05:49+05:30 IST