పెట్రో ధరలు తగ్గించాలి: సీపీఐ

ABN , First Publish Date - 2021-06-19T05:28:08+05:30 IST

పెంచిన పెట్రో ధరలను వెంటనే తగ్గించాలనిసీపీఐ నాయకులు డిమాండు చేశారు. శుక్రవారం బి.కొత్తకోట జ్యోతిబస్టాండులో ఆటోకు తాళ్లు కట్టి లాగి నిరసన వ్యక్తం చేశారు. నీరుగుట్టువారిపల్లెలోని మార్కెట్‌ యార్డు ఎదురుగా సీపీఎం నాయకులు ఎద్దలబండిపై స్కూటర్‌ పెట్టి, నెత్తిన గ్యాస్‌ సిలిండర్‌తో నిరసన చేశారు.

పెట్రో ధరలు తగ్గించాలి: సీపీఐ
బి.కొత్తకోటలో నిరసన తెలుపుతున్న సీపీఐ నాయకులు

బి.కొత్తకోట/ మదనపల్లె అర్బన్‌, జూన్‌ 18: పెంచిన పెట్రో ధరలను వెంటనే తగ్గించాలనిసీపీఐ నాయకులు డిమాండు చేశారు. శుక్రవారం బి.కొత్తకోట జ్యోతిబస్టాండులో ఆటోకు తాళ్లు కట్టి లాగి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట అర్ధనగ్నంగా బైఠాయించారు. ఈ సందర్భంగా సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ చమురు ధరలు భారీగా తగ్గుతున్న సమయంలో ఎక్సైజ్‌ సుంకాల పేరుతో పెంచుకుంటూ పోవడం దారుణమన్నారు. కరోనాతో ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు పెంచిన ధరలు మోయలేని విధంగా పరిణమించాయని వాపోయారు.   సీపీఐ పట్టణ కార్యదర్శి సలీంబాషా, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి, అష్రఫ్‌అలీ, తంబయ్యశెట్టి, జవహర్‌బాషా తదితరులు పాల్గొన్నారు. 

మదనపల్లె అర్బన్‌:   నీరుగుట్టువారిపల్లెలోని మార్కెట్‌ యార్డు ఎదురుగా సీపీఎం నాయకులు  ఎద్దలబండిపై స్కూటర్‌ పెట్టి, నెత్తిన గ్యాస్‌ సిలిండర్‌తో నిరసన చేశారు. పెట్రో ధరలను తగ్గించాలంటూ కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఎం జిల్లా కార్యవర్గసభ్యుడు శ్రీనివాసులు మాట్లాడుతూ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 21 సార్లు పెట్రో ఉత్పత్తులపై ధరలు పెంచిందన్నారు. కొవిడ్‌ మందులను  బ్లాక్‌ మార్కెట్‌ చేస్తున్నా నివారించడంలో ప్రభుత్వం విఫలమైంద న్నారు. ఆదాయ పన్ను చెల్లింపు పరిధిలో లేని కుటుంబాలకు నెలకు రూ.7500 చొప్పన ఆరు నెలలపాటు అందివ్వాలని, ప్రతి వ్యక్తి పది కిలోల బియ్యం, పప్పు, చక్కెర, వంటనూనెను ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు.  హరీంద్రనాథ శర్మ, నాగరాజు, శివ, అశోక్‌, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు కృష్ణప్ప, మదనపల్లె నియోజకవర్గ కార్యదర్శి సాంబశివ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ సర్కిల్‌లోని పెట్రోల్‌బంకు వద్ద సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఐ పట్టణ కార్యదర్శి మురళి, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి దేవ, సురేష్‌కుమార్‌, తిరుమలప్ప, బాలు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-06-19T05:28:08+05:30 IST