పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి

ABN , First Publish Date - 2021-06-19T05:41:54+05:30 IST

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర ధరలు వెంటనే తగ్గించాలని సీపీఎం, సీపీఐ, అనుబంధ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి
నందికొట్కూరులో రిక్షా లాగుతూ నిరసన తెలుపుతున్న సీపీఐ నాయకులు

  1. సీపీఎం, సీపీఐ నాయకుల డిమాండ్‌


నంద్యాల, జూన్‌ 18: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర ధరలు వెంటనే తగ్గించాలని సీపీఎం, సీపీఐ, అనుబంధ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం నంద్యాలలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట బైక్‌లను నిలిపి ప్లకార్డులతో గంటపాటు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కరోనా విపత్తుతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి 6 నెలల పాటు రూ.7,500 ఇవ్వాలని, కేరళ ప్రభుత్వ తరహాలో 17 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. కరోనా నివారణ మందులను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్‌, తోట మద్దులు, బాబాఫకృద్దీన్‌, భాస్కర్‌, ప్రసాద్‌, నరసింహ, వెంకటలింగం, నాగరాముడు, డీవైఎ్‌ఫఐ, ఏఐఎ్‌సఎఫ్‌, రైతు సంఘం, కేవీపీఎస్‌, మోటార్‌ వర్కర్స్‌ యూనియన్‌, ఎస్‌ఎ్‌ఫఐ సభ్యులు పాల్గొన్నారు. 


పాణ్యం: ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోవడమంటే ఇదేనా? అని ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నించారు. పెట్రోల్‌, డీజిల్‌ పెంపునకు నిరసనగా శుక్రవారం స్థానిక వరుణ్‌ పెట్రోల్‌ బంకు వద్ద సీఐటీయూ, ఏఐఎ్‌ఫబీ, ఆర్‌వీఎఫ్‌ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ రెండు నెలల్లో 21 సార్లు ధరలు పెంచిన ఘనత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే చెల్లుతుందని అన్నారు.  ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్‌, ప్రతాప్‌, ధానం, అశోక్‌, ప్రేమకుమార్‌, గురునాథ్‌, సుధీర్‌,,వెంకట్‌, నాగరాజు, సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు. 


రుద్రవరం: పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని రాష్ట్రవ్యాప్తంగా భారత  కమ్యూనిస్టూ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం రుద్రవరం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్‌ వెంకటశివకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ తాలుకా కార్యదర్శి భాస్కర్‌ మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధరలు రూ.100 దాటాయి. నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్య ప్రజలు కొనాలంటే చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి బాలనరసింహుడు, ఎమ్మార్పీఎస్‌ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, సీపీఐ కార్యకర్తలు బాషా, శివకేశవ, రాజన్న, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. 


నందికొట్కూరు: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని నందికొట్కూరు పట్టణంలో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. సీపీఐ నాయకులు రిక్షా లాగుతూ వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా సీపీఐ జిల్లా నాయకులు రఘురామ్మూర్తి మాట్లాడుతూ కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి ప్రజలపై భారం మోపడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమే్‌షబాబు, జగదీ్‌షబాబు, శ్రీనివాసులు, భాస్కర్‌రెడ్డి, పక్కీర్‌సాహెబ్‌, బెస్తరాజు పాల్గొన్నారు. 


ఆత్మకూరు: నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సీపీఎం పట్టణ కార్యదర్శి ఏసురత్నం, నాయకులు రణధీర్‌  పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక పాతబస్టాండ్‌లో గల అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ్‌నాయక్‌, భాస్కర్‌, శివుడు, చంద్ర, గణపతి, మల్లయ్య  పాల్గొన్నారు. 


గోస్పాడు: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. శుక్రవారం గోస్పాడు బస్టాండ్‌ ఆవరణలో ధర్నాలో పాల్గొన్న సీపీఐ నాయకులు చెన్నయ్య మాట్లాడుతూ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను పెంచి పేద ప్రజల బ్రతుకులను దుర్భరం చేస్తుందని అన్నారు. నిత్యావసర వస్తువులను ధరలను అడ్డు అదుపు లేకుండా పెంచేస్తుందని విమర్శించారు. అనంతరం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. 


పాములపాడు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోలు, డీజిల్‌, నిత్యావసర ధరలు వెంటనే తగ్గించాలని సీపీఎం ఆధ్వర్యంలో పాములపాడు బస్టాండ్‌ ఆవరణలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం  జిల్లా నాయకులు బి. రామేశ్వరరావు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు పెరిగి పోతుండటంతో పేద మధ్యతరగతి ప్రజలు అల్లాడి పోతున్నారన్నారు. కార్యక్రమంలో, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి సామన్న, రైతు సంఘం నాయకులు వెంకటేశ్వరరావు, కేవీపీఎస్‌   జిల్లా నాయకులు మేకలరాజ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు బాలయ్య, మహిళ సంఘం నాయకురాలు బాల ఈశ్వరమ్మ పాల్గొన్నారు.



Updated Date - 2021-06-19T05:41:54+05:30 IST