పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి

ABN , First Publish Date - 2021-06-19T05:47:02+05:30 IST

పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో పెట్రోల్‌ ధరల పెంపును నిరసిస్తూ ఎడ్ల బండితో నిరసన తెలిపారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి
రామడుగులో నిరసన చేస్తున్న సీపీఐ నాయకులు

 సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్‌

రామడుగు, జూన్‌ 18: పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో పెట్రోల్‌ ధరల పెంపును నిరసిస్తూ ఎడ్ల బండితో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలే కాకుండా అన్ని రకాల నిత్యావసర వస్తువు ధరలు పెంచి అన్నివర్గాల ప్రజలపై అదనపు భారం మోపుతు న్నారని, ఆర్థికంగా కుదేలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను విచ్చలవిడిగా పెంచడంతో వంద రూపాయలు దాటిందని, ధరలను నియంత్రణ చేయడంలో పాల కులు నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రజల పక్షం కాకుండా పెట్టుబడిదారి వర్గాలకు కొమ్ముకాస్తు న్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం పునరాలోచన చేసుకొని పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని, లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో సీపీఐ మండల కార్యదర్శి ఉమ్మెంతల రవీందర్‌ రెడ్డి, జిల్లా కౌన్సిల్‌ సభ్యులు మచ్చ రమేశ్‌, గంటె రాజేశం, ఎగుర్ల మల్లేశం, మచ్చ మహేశ్‌, నర్సయ్య, ఐలయ్య, కనకయ్య,  పాల్గొన్నారు.


Updated Date - 2021-06-19T05:47:02+05:30 IST