రెండు రోజుల తరువాత పెరిగిన పెట్రోల్, డీజెల్ ధరలు!

ABN , First Publish Date - 2021-07-15T13:35:09+05:30 IST

ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్-డీజెల్ ధరలను...

రెండు రోజుల తరువాత పెరిగిన పెట్రోల్, డీజెల్ ధరలు!

న్యూదిల్లీ: ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్-డీజెల్ ధరలను రెండు రోజుల విరామం తరువాత ఈరోజు పెంచాయి. దేశంలోని నాలుగు ప్రమఖ నగరాలలో పెట్రోల్ ధర 31 నుంచి 39 పైసల వరకు, డీజెల్ ధర 15 నుంచి 21 పైసల వరకూ పెరిగింది. ఈ పెరిగిన ధరలతో పెట్రోల్, డీజెల్ ధరలు కొత్త రికార్డుకు చేరుకున్నాయి. రాష్ట్ర రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 101.54 పైసలకు చేరగా, డీజెల్ ధర 89.87 పైసలకు చేరింది. ముంబైలో లీటరు పెట్రోలు ధర 107.54 పైసలకు చేరగా, డీజెల్ ధర రూ. 97.45 పైసలకు చేరింది. కోల్‌కతాలో పెట్రోల్ లీటరు ధర రూ.101.54 పైసలుగా ఉండగా, డీజెల్ ధర రూ. 89.87 పైసలుగా ఉంది. 

Updated Date - 2021-07-15T13:35:09+05:30 IST