మ‌రోమారు పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు

ABN , First Publish Date - 2021-06-14T13:54:41+05:30 IST

దేశంలో చమురు ధరల పెరుగుద‌ల కొనసాగుతోంది.

మ‌రోమారు పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు

న్యూఢిల్లీ: దేశంలో చమురు ధరల పెరుగుద‌ల కొనసాగుతోంది.పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఈ రోజు మరోమారు పెరిగాయి. రాజధాని ఢిల్లీలో పెట్రోల్ 29 పైసలు, డీజిల్ 30 పైసల మేర‌కు పెరిగింది. దీంతో ఢిల్లీలో పెట్రోల్ లీట‌రు 96 రూపాయల 41 పైసలు, డీజిల్ లీట‌రు ధ‌ర 87 రూపాయల 28 పైసలు చొప్పున పెరిగింది. 

నాలుగు మెట్రో నగ‌రాల్లోపెట్రోల్ ధర 

ఢిల్లీ- లీటరు రూ. 96.41పైస‌లు

ముంబై- లీటరు రూ.102.58 పైస‌లు

కోల్‌కతా- లీటరు రూ .96.34 పైస‌లు

చెన్నై - లీటరుకు రూ. 97.69 పైస‌లు



నాలుగు మెట్రో న‌గ‌రాల్లో డీజిల్ ధర

ఢిల్లీ- లీటరు రూ. 87.28 పైస‌లు

ముంబై- లీటరు రూ. 94.70 పైస‌లు

కోల్‌కతా - లీటరు రూ.  90.12 పైస‌లు

చెన్నై - లీటరు రూ. 91.92పైస‌లు

వ్యాట్, సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నుల కారణంగా ఇంధన ధరలు ప్ర‌తిరాష్ట్రానికి మారుతూ ఉంటాయి. దేశంలో పెట్రోల్‌పై రాజస్థాన్‌లో అత్యధిక వ్యాట్ ఉంది తరువాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి.



Updated Date - 2021-06-14T13:54:41+05:30 IST