భవిష్యత్తులో పెట్రో వాత!

ABN , First Publish Date - 2020-03-24T09:43:50+05:30 IST

భవిష్యత్తులో పెట్రోలు, డీజిల్‌ ధరలను భారీగా పెంచేందుకు కేంద్రం ముందస్తుగా ఏర్పాట్లు చేసుకుంది. దీనికి సంబంధించిన చట్టాన్ని సవరించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన...

భవిష్యత్తులో పెట్రో వాత!

  • ఎక్సైజ్‌ సుంకం పెంపునకు ముందస్తు సవరణ
  • చర్చ లేకుండానే ఆర్థిక బిల్లు ఆమోదం
  • సభలో మోదీతోపాటు అంతా చప్పట్లు
  • పార్లమెంటు నిరవధిక వాయిదా


న్యూఢిల్లీ, మార్చి 23: భవిష్యత్తులో పెట్రోలు, డీజిల్‌ ధరలను భారీగా పెంచేందుకు కేంద్రం ముందస్తుగా ఏర్పాట్లు చేసుకుంది. దీనికి సంబంధించిన చట్టాన్ని సవరించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లును లోక్‌సభ సోమవారం ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించింది. దాంతోపాటే పెట్రోలు, డీజిల్‌పై ప్రత్యేక ఎక్సైజ్‌ సుం కానికి సంబంధించిన చట్ట సవరణను కూడా సభ ఆమోదించింది. దీని ద్వారా భవిష్యత్తులో ఎప్పుడైనా పెట్రోలు, డీజిల్‌పై ప్రత్యేక ఎక్సైజ్‌ సుంకాన్ని లీటరుకు 8 రూపాయలదాకా పెంచుకునేందుకు వీలు కలుగుతుంది.


చట్టాన్ని సవరించామే తప్ప కొత్తగా ఎక్సైజ్‌ సుంకంలో ఎలాంటి మార్పు చేయలేదని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఆర్థిక బిల్లును మొదట లోక్‌సభ, తర్వాత రాజ్యసభ ఎలాంటి చర్చ లేకుండా కొన్ని గంటల వ్యవధిలో ఆమోదించాయి. తర్వాత 2020-21 ద్రవ్య వినియోగ బిల్లును రాజ్యసభ  ఆమోదించి లోక్‌సభకు పంపింది. అక్కడా బిల్లుకు ఆమోద ముద్ర పడింది. కరోనా వైరస్‌ భయంతో పలువురు ఎంపీలు రాజ్యసభకు హాజరు కాలేదు.

Updated Date - 2020-03-24T09:43:50+05:30 IST