‘డబుల్‌ మ్యుటెంట్‌’పై ఫైజర్‌ పనిచేయొచ్చు: ఇజ్రాయెల్‌

ABN , First Publish Date - 2021-04-21T07:40:21+05:30 IST

భారత్‌లో మొట్టమొదట గుర్తించిన ‘డబుల్‌ మ్యుటెంట్‌’ (బి.1.167) కరోనా వైరస్‌ వేరియంట్‌పై ఫైజర్‌ వ్యాక్సిన్‌ పాక్షికంగా పనిచేస్తుందని ఇజ్రాయెల్‌ ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది...

‘డబుల్‌ మ్యుటెంట్‌’పై ఫైజర్‌ పనిచేయొచ్చు: ఇజ్రాయెల్‌

జెరుసలెం, ఏప్రిల్‌ 20 : భారత్‌లో మొట్టమొదట గుర్తించిన ‘డబుల్‌ మ్యుటెంట్‌’ (బి.1.167) కరోనా వైరస్‌ వేరియంట్‌పై ఫైజర్‌ వ్యాక్సిన్‌ పాక్షికంగా పనిచేస్తుందని ఇజ్రాయెల్‌ ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. అయితే దానిపై ఈ టీకా ప్రభావశీలత కాస్త తక్కువగానే ఉండొచ్చని వెల్లడించింది. ఇటీవల విదేశాల నుంచి తమ దేశానికి వచ్చిన 8 మందికి ఈ వేరియంట్‌ వల్ల ఇన్ఫెక్షన్‌ సోకినట్లు గుర్తించామని తెలిపింది. మరోవైపు బ్రిటన్‌, ఐర్లాండ్‌లలోనూ ‘డబుల్‌ మ్యుటెంట్‌’కు సంబంధించిన కేసులు వెలుగుచూడగా.. బి.1.167 వేరియంట్‌పై అధ్యయనం చేస్తున్నట్లు ఆ దేశాలు ప్రకటించాయి. 

Updated Date - 2021-04-21T07:40:21+05:30 IST