రూ.20.21 కోట్లతో పీహెచ్‌సీ భవనాలకు మరమ్మతులు

ABN , First Publish Date - 2020-11-28T06:16:12+05:30 IST

జిల్లాలోని 39 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీలు) భవనాలకు మరమ్మతు పనులు చేస్తున్నట్టు ఆర్‌అండ్‌బీ పాడేరు ఇన్‌చార్జి ఈఈ వేణుగోపాలరావు తెలిపారు.

రూ.20.21 కోట్లతో పీహెచ్‌సీ భవనాలకు మరమ్మతులు
మరమ్మతు పనులు జరగనున్న యు.చీడిపాలెం పీహెచ్‌సీ


ఆర్‌అండ్‌బీ ఇన్‌చార్జి (పాడేరు) ఈఈ వేణుగోపాలరావు 


కొయ్యూరు, నవంబరు 27: జిల్లాలోని 39 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీలు) భవనాలకు మరమ్మతు పనులు చేస్తున్నట్టు ఆర్‌అండ్‌బీ పాడేరు ఇన్‌చార్జి ఈఈ వేణుగోపాలరావు తెలిపారు. శుక్రవారం మండల పర్యటనకు వచ్చిన సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, వైద్య ఆరోగ్య శాఖ రూ.20.21 కోట్లు మంజూరు చేయగా, దీనిలో 30 శాతం నిధులను వైద్య పరికరాల కొనుగోలుకు ఆయా పీహెచ్‌సీల ఖాతాల్లో జమ చేశామన్నారు. మిగిలిన నిధులతో పీహెచ్‌సీల భవనాలకు మరమ్మతులు, అభివృద్ధి పనులు చేస్తున్నట్టు చెప్పారు. నాతవరం మండలంలో రూ.1.9 కోట్లతో నూతన పీహెచ్‌సీ భవన నిర్మాణం జరుగుతున్నదన్నారు. రోలుగుంట మండలంలో రూ.1.33 కోట్లు, మాకవరపాలెంలో రూ.1.49 కోట్లు, మాడుగులలో రూ.1.29 కోట్లు, గొలుగొండలో రూ.1.76 కోట్లు, రావికమతంలో రూ.45 లక్షలు, జీకేవీధిలో రూ.3.23 కోట్లు, చింతపల్లిలో రూ.25 లక్షలు, హుకుంపేటలో రూ.1.3 కోట్లు, పెదబయలులో రూ.1.11 కోట్లు, ముంచంగిపుట్టులో రూ.61 లక్షలు, కొయ్యూరు మండలంలో రూ.2.47 కోట్లతో ఆయా పీహెచ్‌సీల్లో పనులు జరుగుతున్నాయని, వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఈఈ వేణుగోపాలరావు వివరించారు. 


Updated Date - 2020-11-28T06:16:12+05:30 IST