పీహెచ్‌సీని సందర్శించిన జేసీ

ABN , First Publish Date - 2021-04-23T01:54:22+05:30 IST

పర్చూరు ప్రభుత్వ వైద్యశాలను జిల్లా సంయుక్త కలెక్టర్‌ టీ.ఎస్‌.చేతన్‌ గురువారం సందర్శించారు. వైద్యసేవలు, రోగుల పరిస్థితి తదితర అంశాలను సూపర్‌ఇన్‌డెండ్‌ మహేశ్వరరెడ్డిని అడిగి తెలుసుకున్నాడు.

పీహెచ్‌సీని సందర్శించిన జేసీ
పర్చూరు వైద్యశాలలో రోగులను పరిశీలిస్తున్న జేసీ చేతన్‌

సమర్థవంతంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ నిర్వహించాలని సూచనలు

పర్చూరు, ఏఫ్రిల్‌ 22: పర్చూరు ప్రభుత్వ వైద్యశాలను జిల్లా సంయుక్త కలెక్టర్‌ టీ.ఎస్‌.చేతన్‌ గురువారం సందర్శించారు. వైద్యసేవలు, రోగుల పరిస్థితి తదితర అంశాలను సూపర్‌ఇన్‌డెండ్‌ మహేశ్వరరెడ్డిని అడిగి తెలుసుకున్నాడు. కొవిడ్‌ పరీక్షలతోపాటు  వ్యాక్సినేషన్‌ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. వైద్యశాలకు వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక  శ్రద్ధ వహించాలని కోరారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని కొవిడ్‌ నిబంధనలు పాటించే విధంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వైద్యశాలలో కొంత సిబ్బంది కొరత ఉందని, పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాలని వైసీపీ ఇన్‌చార్జి రావి రామనాథంబాబు జేసీ దృష్టికి తీసుకుపోయారు.

జేసీకి వ్యాపారుల వినతి

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం అనుసరిస్తున్న లాక్‌డౌన్‌ నిబంధనలకు సంబంధించి వ్యాపారులు జాయింట్‌ కలెక్టర్‌ చేతన్‌కు వినతి పత్రం అందజేశారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 6గంటల వరకు దుకాణాలు నిర్వహించే విధంగా అదేశాలు జారీ చేశారన్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు దుకాణాలు నిర్వహించుకునే విధంగా అనుమతి ఇవ్వాలని వినతిలో కోరారు. 

Updated Date - 2021-04-23T01:54:22+05:30 IST