లేటు వయసులో పెళ్లి చేసుకుంటోందని అంతా హాజరయ్యారు.. పెళ్లి మండపంపై వరుడు స్థానంలో ఎవరున్నారో తెలుసుకుని..

ABN , First Publish Date - 2022-01-08T00:20:29+05:30 IST

ఓ మహిళ 40ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందరినీ వివాహానికి ఆహ్వానించింది. బంధువులు, సన్నిహితులంతా తరలివచ్చారు. అయితే ఆమె పక్కన వరుడి స్థానంలో..

లేటు వయసులో పెళ్లి చేసుకుంటోందని అంతా హాజరయ్యారు.. పెళ్లి మండపంపై వరుడు స్థానంలో ఎవరున్నారో తెలుసుకుని..

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటారు పెద్దలు. అయితే కొందరు వివిధ కారణాలతో చాలా ఆసల్యంగా వివాహం చేసుకుంటుంటారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ మహిళ 40ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందరినీ వివాహానికి ఆహ్వానించింది. బంధువులు, సన్నిహితులంతా తరలివచ్చారు. అయితే ఆమె పక్కన వరుడి స్థానంలో ఉన్న వస్తువును చూసి అవాక్కయ్యారు. ఇలాక్కూడా పెళ్లి చేసుకుంటారా.. అని చర్చించుకున్నారు.


అమెరికాలోని లాస్ వేగాస్‌కు చెందిన కిట్టెన్ కే సెరా(40)కు ఈ ఏడాది జనవరి 1న వివాహం జరిగింది. ఆశీర్వదించి వెళ్దామని అంతా తరలివచ్చారు. తీరా మండపంలో వరుడి స్థానంలో పింక్ కలర్ ఉండడంతో అంతా నోరెళ్లబెట్టారు. పింక్ కలర్‌ను పెళ్లి చేసుకోవడమేంటీ అని ఆశ్చర్యపోయారు. ఈమెకు చిన్నప్పటి నుంచి పింక్ కలర్ అంటే ఎంతో ఇష్టమట. తన ఇంట్లో ప్రతి వస్తువూ పింక్ కలర్‌లో ఉండేలా చూసుకుంది. ఇక తన దుస్తులతో పాటూ ఆఖరికి తన హెయిర్ కలర్ కూడా పింక్ కలర్‌లో ఉంటుంది.

వారిద్దరూ డాక్టర్లు.. సహజీవనం తర్వాత పెళ్లి చేసుకుందామంటే ఒప్పుకోని పెద్దలు.. ఆ ఒక్క కారణంతో..


40ఏళ్ల వరకూ పింక్ కలర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని.. ఆ కలర్‌నే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నానని చెబుతోంది. పెళ్లి వేడుకలో మండపంతో సహా మొత్తం పింక్ కలర్‌లో డిజైన్ చేయించుకుంది. మండపంపై పింక్ గౌన్ ధరించి తళుక్కున మెరిసింది. ఈ సందర్భంగా బంధువులతో ఫొటోలు తీసుకుని తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇదెక్కడి వింత విడ్డూరమంటూ.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

గుండెపోటుతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన తల్లి.. ఈ ఏడేళ్ల కొడుకు చేసిన పనేంటో తెలిసి అవాక్కైన డాక్టర్లు..!



Updated Date - 2022-01-08T00:20:29+05:30 IST