Abn logo
May 22 2020 @ 09:05AM

కరోనాతో శారీరక, మానసిక సమస్యలు

దీర్ఘకాలం పాటు ప్రభావం: పరిశోధకులు

వాషింగ్టన్‌, మే 21: కరోనా బారినపడి కోలుకున్న వారికి భవిష్యత్తులో శారీరక, మానసిక సమస్యలు కూడా ఎదురయ్యే ప్రమాదముందని ఓ అధ్యయనం తేల్చింది. ముఖ్యంగా ఆర్థిక, సామాజిక బలహీనుల్లో ఈ ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించింది. అమెరికాకు చెందిన ఓ పరిశోధకుల బృందం.. అక్కడి న్యూవోర్లీన్స్‌లో నివసిస్తున్న పేద మహిళలపై 2005 నుంచి పలు దఫాలుగా ఓ సర్వే నిర్వహిస్తోంది. 2005లో వచ్చిన కత్రినా హరికేన్‌లో తీవ్రంగా దెబ్బతిన్న ఈ మహిళల మానసిక స్థితిపై ఈ అధ్యయనం కొనసాగింది. ఆ ప్రభావం 2007, 2012, 2017లో జరిపిన అధ్యయనంలో కూడా ఆ మహిళలపై కనిపించిందని పరిశోధకులు తెలిపారు. 

Advertisement
Advertisement