వైరల్ అవుతున్న జింక కొమ్ములు!

ABN , First Publish Date - 2021-03-30T20:46:57+05:30 IST

ఈ ఫొటోలను మొదటిసారి సోషల్ మీడియాలో చూసినపుడు అందరూ అలాగే ఆశ్చర్యపోయారు.

వైరల్ అవుతున్న జింక కొమ్ములు!

ఫొటోలో కనిపిస్తున్న జింక కొమ్ములేంటి అలా ఉన్నాయి అని ఆశ్చర్యపోతున్నారా? మీరే కాదు.. ఈ ఫొటోలను మొదటిసారి సోషల్ మీడియాలో చూసినపుడు అందరూ అలాగే ఆశ్చర్యపోయారు. ఇదేదో కొత్త జంతువని కొందరు అనుకున్నారు. జింక కొమ్ముల మధ్య ప్లాస్టిక్ ఇరుక్కుపోయిందని మరికొందరు అనుకున్నారు. నిజం ఏంటంటే.. ఆ జింక రెండు కొమ్ముల మధ్య ఓ సాలె పరుగు అల్లుకున్న గూడు అది. 


ఆఫ్రికా ఖండంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న బొత్సవానాలోని సెంట్రల్ కలహరి గేమ్ రిజర్వ్‌లో ఉన్న జింక కొమ్ములను చూసిన తర్వాత అక్కడి నిర్వాహకులే ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అది సాలె గూడు అని తెలుసుకున్నారు. ఆ ఫొటోలను ఈ నెల 24న సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Updated Date - 2021-03-30T20:46:57+05:30 IST