పిఠాపురంలో అధ్వానంగా పారిశుధ్యం

ABN , First Publish Date - 2021-07-29T05:08:38+05:30 IST

పిఠాపురం, జూలై 28: నియోజకవర్గంలోని పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా ఉందని, నిర్వహణ గాలికి వదిలివేశారని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ విమర్శించారు. పిఠాపురంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఎక్కడిక్కడ పందులు స్వైర విహారం చేస్తున్నాయని తెలిపారు. పిఠాపురంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని చెప్పారు. ఇక్కడ కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నా

పిఠాపురంలో అధ్వానంగా పారిశుధ్యం
పిఠాపురం సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే వర్మ

మాజీ ఎమ్మెల్యే వర్మ

పిఠాపురం, జూలై 28: నియోజకవర్గంలోని పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా ఉందని, నిర్వహణ గాలికి వదిలివేశారని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ విమర్శించారు. పిఠాపురంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఎక్కడిక్కడ పందులు స్వైర విహారం చేస్తున్నాయని తెలిపారు. పిఠాపురంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని చెప్పారు. ఇక్కడ కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పారిశుధ్య నిర్వహణ పేరుతో గ్రామ పంచాయతీల్లో డబ్బులు డ్రా చేస్తున్నారని ఆరోపించారు. ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నుల పెంపు, చెత్తపన్ను విధింపు తప్ప వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమి లేదని విమర్శించారు. అధికార పార్టీ నేతలకు ప్రజాసమస్యలు పట్టడం లేదన్నారు. నాలుగురోజుల్లోగా పారిశుధ్య నిర్వహణపై అధికారులు స్పందించకుంటే ఆందోళన చేపడతామని వర్మ హెచ్చరించారు. సమావేశంలో టీడీపీ పట్టణ, మండలశాఖ అధ్యక్షులు రెడ్డెం భాస్కరరావు, సకుమళ్ల గంగాధర్‌, నల్లా శ్రీను, కొరుప్రోలు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-29T05:08:38+05:30 IST