Abn logo
Nov 25 2021 @ 08:09AM

రైతులకు కేంద్రం శుభవార్త...త్వరలో PM Kisan Yojana నిధులు

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం కింద 10వ విడత నిధులను డిసెంబర్ 15 వతేదీ నాటికి విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. పీఎం కిసాన్ పథకం కింద నమోదు చేసుకున్న రైతులందరికీ రూ.2000 అందుతాయి. అయితే, ఈ పథకం కింద నగదు పొందేందుకు అర్హత ఉంటే, కొత్త రైతులైనా కిసాన్ యోజన కింద సులభంగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చునని కేంద్రం తెలిపింది.రైతులు పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. 

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతులు ప్రతి సంవత్సరం రూ. 6000లను ఒక్కొక్కరికి రూ.2000 చొప్పున మూడు విడతలుగా అందుకుంటారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ డబ్బును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. పీఎం కిసాన్ పోర్టల్‌లోని ఫార్మర్స్ కార్నర్ ద్వారా రైతులు తమ పేర్లను కొత్తగా నమోదు చేసుకోవచ్చు.