గాంధేయ మార్గంలో న్యాయవ్యవస్థకు పునాది: ప్రధాని

ABN , First Publish Date - 2020-02-22T19:16:23+05:30 IST

దేశరాజధానిలో జరుగుతున్న అంతర్జాతీయ న్యాయసదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు.

గాంధేయ మార్గంలో న్యాయవ్యవస్థకు పునాది: ప్రధాని

ఢిల్లీ: దేశరాజధానిలో జరుగుతున్న అంతర్జాతీయ న్యాయసదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. 24 దేశాల నుంచి న్యాయనిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని.. నిరంతర అధ్యయనంతోనే కొత్త విషయాలు తెలుసుకోవచ్చని తెలిపారు. మహాత్మగాంధీ తన జీవితాన్ని సత్యం, సేవా మార్గంలో కొనసాగించారన్నారు. 135 కోట్ల మంది న్యాయవ్యవస్థ ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటున్నారని చెప్పారు. వ్యవస్థలో మార్పులు హేతుబద్ధంగా, చట్టప్రకారం ఉండాలన్నారు. గాంధీ ఆచరించిన మార్గంలోనే న్యాయవ్యవస్థకు పునాది వేశారని.. మహిళలకు ఓటు హక్కు కల్పించిన ప్రముఖ దేశాల్లో భారత్ ఒకటన్నారు. భారత దేశ శాసన, న్యాయ వ్యవస్థలు పరస్పరం గౌరవించుకుంటాయన్నారు. 



ఉగ్రవాదం, సైబర్‌ క్రైమ్‌ ప్రధాన సమస్యలని సుప్రీం కోర్టు జస్టిస్‌ ఎన్వీరమణ పేర్కొన్నారు. కొత్త ఆలోచనలతో న్యాయవ్యవస్థ ముందుకు రావాలని అభిలషించారు. సమస్యల పరిష్కారానికి అందరూ కృషి చేయాలన్నారు. 

Updated Date - 2020-02-22T19:16:23+05:30 IST