ఆప్ఘన్ పరిణామాలపై పార్టీలకు బ్రీఫింగ్... మోదీ ఆదేశం

ABN , First Publish Date - 2021-08-23T20:52:58+05:30 IST

అప్ఘన్ పరిణాలపై రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లకు సంక్షిప్తంగా వివరించాలని విదేశాంగ శాఖను ప్రధాని నరేంద్ర మోదీ ..

ఆప్ఘన్ పరిణామాలపై పార్టీలకు బ్రీఫింగ్... మోదీ ఆదేశం

న్యూఢిల్లీ: అప్ఘన్ పరిణాలపై రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లకు సంక్షిప్తంగా వివరించాలని విదేశాంగ శాఖను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సోమవారంనాడు ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన తక్కిన వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేస్తారని ఆయన చెప్పారు. కాబూల్ తాలిబాన్ గుప్పిట్లోకి వెళ్లిన నేపథ్యంలో అక్కడి భారత పౌరులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకువస్తున్న నేపథ్యంలో మోదీ ఈ తాజా ఆదేశాలిచ్చారు.


రాబోయే రోజుల్లో అప్ఘనిస్థాన్‌ నుంతి భారతీయులను సురక్షితంగా తరలించేందుకు సంబంధింత అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఈనెల 17న జాతీయ భద్రతపై క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని మోదీ ఆదేశాలిచ్చారు. సురక్షితంగా అందర్నీ అప్ఘనిస్థాన్ నుంచి భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంఈఏ ఒక ప్రకటనలో పేర్కొంది. కాబూల్ విమానాశ్రయం నుంచి ఆపరేషనల్ స్టాటస్ అనేది ఈ విషయంలో ప్రధాన సవాలని తెలిపింది. కాగా, ఆదివారంనాడు భారత ప్రభుత్వం మూడు వేర్వేరు విమానాల్లో సుమారు 400 మందిని వెనక్కి తీసుకువచ్చింది.

Updated Date - 2021-08-23T20:52:58+05:30 IST