యోగి డబుల్ ఇంజిన్ సర్కార్‌పై మోదీ ప్రశంసలు
ABN , First Publish Date - 2021-09-14T22:23:03+05:30 IST
ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు మరికొద్ది నెలల్లో
అలీగఢ్ : ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగబోతున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం టీకాకరణలో రికార్డు సృష్టించిందన్నారు. నిరుపేదల లబ్ధి కోసం సాధ్యమైన ప్రతి చర్యను అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్టేట్ యూనివర్సిటీకి అలీగఢ్‌లో శంకుస్థాపన చేసిన అనంతరం మంగళవారం ఆయన మాట్లాడారు.
కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రయోజనాలను సాధిస్తోందని ప్రశంసించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ లాభాలను పొందుతున్న రాష్ట్రానికి ఉత్తర ప్రదేశ్ ఉదాహరణ అని చెప్పారు. ఉత్తర ప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కృషి చేస్తున్నాయన్నారు.
ఉత్తర ప్రదేశ్‌లో ఇప్పటి వరకు 8 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను ఇచ్చినట్లు తెలిపారు. ఒక రోజులో అత్యధిక డోసులు ఇచ్చిన ఘనత కూడా ఉత్తర ప్రదేశ్‌కే దక్కుతుందన్నారు.