Abn logo
Aug 5 2020 @ 12:11PM

అయోధ్య హనుమాన్ మందిరంలో మోదీ పూజలు

అయోధ్య :  రామాలయానికి భూమి పూజ చేసేందుకు బుధవారం అయోధ్య నగరానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందుగా హనుమాన్ గర్హి మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. లక్నో నుంచి అయోధ్యకు భారత వాయుసేన హెలికాప్టరులో వచ్చిన ప్రధానమంత్రి మోదీ హనుమాన్ మందిరంలో పూజలు చేసి హారతి ఇచ్చారు. 10వ శతాబ్ధానికి చెందిన హనుమాన్ మందిరంలో పూజలు చేసిన మోదీ రాంలాలా  స్థలానికి చేరుకున్నారు.రాంలాలా దేవాలయంలో ప్రధాని మోదీ సాష్టాంగ ప్రణామం చేశారు. మూడు గంటల పాటు ఆలయంలో ఉండే భూమి పూజ కార్యక్రమంలో మోదీ పాల్గొంటున్నారు. హనుమాన్ ఆలయంలో ప్రధాని మోదీ శిరసు వంచి నమస్కరించారు. నేషనల్ సెక్యూరిటీ గార్డుల భారీ భద్రత మధ్య మోదీ సామాజిక దూరం పాటించారు. ఆలయంలో పూజలు చేసిన సందర్భంగా పూజారులు, సీఎం యోగి ఆదిత్యనాథ్ లు కూడా దూరంగా ఉండి పోయారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్కు ధరించిన ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు. 

Advertisement
Advertisement
Advertisement