అలా చేస్తే భారత్-ఆసియాన్ బంధం మరింత బలపడుతుంది : మోదీ

ABN , First Publish Date - 2021-10-28T21:12:38+05:30 IST

ఆగ్నేయాసియా దేశాల సమైక్యత భారత దేశానికి చాలా

అలా చేస్తే భారత్-ఆసియాన్ బంధం మరింత బలపడుతుంది : మోదీ

న్యూఢిల్లీ : ఆగ్నేయాసియా దేశాల సమైక్యత భారత దేశానికి చాలా ముఖ్యమైనదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇండియా-ఆసియాన్ సదస్సులో  గురువారం ఆయన మాట్లాడుతూ, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సహకారానికి భారత్, ఆసియాన్ దృక్పథాలు నిబంధనావళిగా ఉపయోగపడతాయన్నారు. 


భారత్-ఆసియాన్ (ఆగ్నేయాసియా దేశాల సంఘం) సదస్సు వర్చువల్ విధానంలో జరిగింది. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో భారత్, ఆసియాన్ ఆలోచనలు వాటి ఉమ్మడి దార్శనికత, పరస్పర సహకారాలకు నిబంధనావళిగా ఉపయోగపడతాయన్నారు. ఇండో-పసిఫిక్ మహాసముద్రాల విషయంలో భారత దేశ వైఖరి, ఆసియాన్ దేశాల దృక్పథం చాలా ముఖ్యమైనవని తెలిపారు. 


ఇండియా-ఆసియన్ భాగస్వామ్యానికి 2022తో 30 ఏళ్ళు పూర్తవుతుందని చెప్పారు. ఈ ముఖ్యమైన మైలురాయిని ఆసియాన్-భారత్ స్నేహ సంవత్సరంగా జరుపుకుందామని చెప్పారు. కోవిడ్ మహమ్మారి సమయంలో పరస్పర సహకారం భారత్-ఆసియాన్ సంబంధాలను భవిష్యత్తులో మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. 


Updated Date - 2021-10-28T21:12:38+05:30 IST