‘పోలీసు అమర వీరుల త్యాగాలు మరువలేనివి’

ABN , First Publish Date - 2021-10-21T05:30:00+05:30 IST

పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, డీఎస్పీ శ్రీనివాసరావు, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ నెక్కంటి సాయిప్రసాద్‌, వైసీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ కంటే వీర్రాఘవరావు, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ బండా రు వీరబాబు, సీఐ జయకుమార్‌, ఎస్‌ఐ మురళీమోహన్‌ పాల్గొన్నారు.

‘పోలీసు అమర వీరుల త్యాగాలు మరువలేనివి’

పెద్దాపురం రూరల్‌, అక్టోబరు 21: పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, డీఎస్పీ శ్రీనివాసరావు, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ నెక్కంటి సాయిప్రసాద్‌, వైసీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ కంటే వీర్రాఘవరావు, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ బండా రు వీరబాబు, సీఐ జయకుమార్‌, ఎస్‌ఐ మురళీమోహన్‌ పాల్గొన్నారు. 

ప్రజలకు రక్షణగా నిలిచేది పోలీసులే 

ఏలేశ్వరం: శాంతి భద్రతలను కాపాడటంతో పాటు సమాజంలో నిరంతరం ప్రజల శ్రేయస్సుకు రక్షణగా నిలిచేది పోలీస్‌ వ్యవస్థేనని ఎస్‌ఐ సీహెచ్‌.విద్యాసాగర్‌ అన్నారు. గురువారం ఆయన నేతృత్వంలో ఏలేశ్వరంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా  పట్టణంలో భారీ ర్యాలీ, బాలాజీచౌక్‌ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. అనంతరం  పోలీసు అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐలు సన్యాసిరావు, సుబ్బిరెడ్డి, అధ్యాపకులు వాగు మాధవ్‌, జి.అనిల్‌కిరణ్‌, హెడ్‌ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. 

జగ్గంపేట: స్థానిక సర్కిల్‌ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి మానవ హారంగా ఏర్పడి పోలీస్‌ అమరవీరులకు జోహర్లు అర్పించారు. ఈ సంద ర్భంగా సీఐ సురేష్‌బాబు మాట్లాడుతూ అక్టోబరు 21న పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సరిహద్దులో ఉండి దేశ రక్షణ కోసం పోరాడే జవాన్లు, లా అండ్‌ ఆర్డర్‌ డ్యూటీ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోలీసులమని అన్నారు. ఎస్‌ఐ లక్ష్మికాంతం మాట్లాడుతూ పోలీస్‌ అమరవీరుల త్యాగం వెలకట్టలే నిదన్నా రు. విద్యార్థులను వాసవీక్లబ్‌ ఆధ్వర్యంలో బుక్స్‌ పంపిణీ చేశారు.  కార్యక్ర మంలో ఏఎస్‌ఐ నూకరాజు, రిటైర్డ్‌ డ్రిల్‌ మాస్టర్‌ కర్రి లక్ష్మినారాయణ, వాసవీ క్లబ్‌  పి.స్వామి, పోలీస్‌ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

కిర్లంపూడి: కిర్లంపూడి పోలీస్‌ కార్యాలయం నుంచి పోలీసులు అమర వీరుల సంస్మరణ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి పోలీస్‌ అమరవీరులకు జోహార్లు అర్పించారు. జగ్గంపేట అడిషనల్‌ ఎస్‌ఐ, కిర్లంపూడి ఇన్‌చార్జ్‌ పి.సునీత, ఏఎస్‌ఐ రామకృష్ణ, రామ్‌కుమార్‌, ఆధ్వర్యం లో పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహి ంచారు. 

గండేపల్లి: గండేపల్లిలో గురువారం పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎస్‌ఐ శోభన్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట సీఐ సురేష్‌బాబు హాజరై ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుంచి తక్షశిల పాఠశాల విద్యార్థులతో ర్యాలీగా జాతీయ రహదారివద్దకు చేరుకుని మానవహారం నిర్వహించారు. 

ప్రత్తిపాడు: ప్రత్తిపాడు  పోలీస్‌స్టేషన్‌లో గురువారం పోలీస్‌ అమర వీరు ల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. అమరులైన పోలీసులకు గౌరవ వందనం చేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు.  ఎస్‌ఐ కె..సుధాకర్‌ అమరవీరుల చిత్రపటానికి  పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్ర మంలో అడిషనల్‌ ఎస్‌ఐ సత్యనారాయణ, పోలీసులు పాల్గొన్నారు.

తొండంగి: మండలంలోని ఒంటిమామిడి పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ మోహన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరులకు నివాళి అర్పించారు. ఓపెన్‌ హౌస్‌ నిర్వహించి పోలీసుల విధులు, ఆయుధాల వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Updated Date - 2021-10-21T05:30:00+05:30 IST