ఆస్పత్రిలో బయటపడిన 12 పుర్రెలు, 54 ఎముకలు.. డాక్టర్‌ను నిలదీస్తే నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి..!

ABN , First Publish Date - 2022-01-22T03:19:08+05:30 IST

ఓ కేసు విచారణ నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన పోలీసులకు.. తనిఖీల్లో ఎముకలు బయటపడ్డాయి. దీంతో ఈ వార్త స్థానికంగా సంచలనం కలిగించింది. ఆఖరికి ఎముకలను డీఎన్‌ఏ పరీక్షలకు పంపాల్సిన పరిస్థితి వచ్చింది. వివరాల్లోకి వెళితే...

ఆస్పత్రిలో బయటపడిన 12 పుర్రెలు, 54 ఎముకలు.. డాక్టర్‌ను నిలదీస్తే నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి..!

ఆస్పత్రిలో సిరంజ్‌లు, రోగులకు సంబంధించిన వ్యర్థాలు ఉంటాయే గానీ.. పుర్రెలు, ఎముకలు ఉండడమేంటీ, అదేమన్నా స్మశానమా.. అని అనుమానం వ్యక్తం చేస్తున్నారా? మీరు అనుకుంటున్నట్లు అది స్మశానం కానే కాదు.. ముమ్మాటికీ ఆస్పత్రే. కానీ ఆస్పత్రి ఆవరణలో పుర్రెలు, ఎముకలు బయటపడ్డాయి. ఓ కేసు విచారణ నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన పోలీసుల.. తనిఖీల్లో ఎముకలు బయటపడ్డాయి. దీంతో ఈ వార్త స్థానికంగా సంచలనం కలిగించింది. ఆఖరికి ఎముకలను డీఎన్‌ఏ పరీక్షలకు పంపాల్సిన పరిస్థితి వచ్చింది. వివరాల్లోకి వెళితే..


మహారాష్ట్ర వార్ధా జిల్లా ఆర్వీ పట్టణానికి చెందిన రేఖ, నీరజ్ దంపతులు వృత్తి రీత్యా గైనకాలజిస్ట్‌లు. పట్టణంలో కదమ్ పేరుతో ఓ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. అయితే జనవరి 9వ తేదీన 13ఏళ్ల బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐదు నెలల గర్భంతో ఉన్న తమ కూతురికి తమ అనుమతి లేకుండా అబార్షన్ చేశారంటూ ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. అనంతరం ఆస్పత్రి పరిసరాల్లో తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆస్పత్రి ఆవరణలో 12పుర్రెలు, 54ఎముకలు బయటపడడంతో షాక్ అయ్యారు. వైద్యులను ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు.

వామ్మో.. వీళ్లు మామూలోళ్లు కాదు.. భార్య పక్కా స్కెచ్.. ఆ తర్వాతే భర్త ఎంట్రీ.. ట్రాప్‌లో పడితే అంతే సంగతులు..!


దీనిపై వైద్యులు మాట్లాడుతూ.. పలువురు గర్భిణులు తమ ఆస్పత్రిలో చట్టబద్ధంగా అబార్షన్ చేయించుకున్నారని తెలిపారు. పుర్రెలు, ఎముకలన్నీ పిండాలకు సంబంధించనవే అని చెప్పారు. ఆస్పత్రి వ్యర్థాలను తీసుకెళ్లే ఏజెన్సీకి సంబంధించిన వాహనాలు రాకపోవడంతో ఎముకలన్నీ నిల్వ చేరాయని సమాధానం ఇచ్చారు. వైద్యులు చెప్పిన మాటల్లో ఎంతవరకు నిజం ఉందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగ్‌పూర్ ఫోరెన్సిక్ లేబొరేటరీ బృందం ఆస్పత్రికి చేరుకుని ఎముకలను డీఎన్‌ఏ పరీక్షల నిమిత్తం తరలించారు. పరీక్ష ఫలితాలు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

గర్భిణిగా ఉన్న మూడో భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లిన భర్త.. డాక్టర్‌తో అతడు చెప్పిన మాట.. చివరకు ఎంతవరకు వెళ్లిందంటే..

Updated Date - 2022-01-22T03:19:08+05:30 IST