ఒంటరిగా జీవిస్తున్న ఇద్దరు పిల్లల తల్లి.. ఆ రెండు తప్పులు చేయడానికి.. కారణమేంటో తెలుసుకుని అంతా షాక్..
ABN , First Publish Date - 2022-04-10T14:24:21+05:30 IST
సవ్యంగా సాగాల్సిన దాంపత్య జీవితం.. ఒక్కోసారి సమస్యలకు నిలయంగా మారుతుంటుంది. అలాంటి సమయాల్లోనే భర్తకు భార్య, భార్యకు భర్త.. అలాగే ...
సవ్యంగా సాగాల్సిన దాంపత్య జీవితం.. ఒక్కోసారి సమస్యలకు నిలయంగా మారుతుంటుంది. అలాంటి సమయాల్లోనే భర్తకు భార్య, భార్యకు భర్త.. అలాగే పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ దూరమవుతుంటుంది. తాము చేస్తున్నది తప్పు అని తెలిసి కూడా కొందరు చేయకూడని తప్పులన్నీ చేస్తుంటారు. చివరికి కటకటాలపాలై జీవితాలను నాశనం చేసుకుంటుంటారు. తమిళనాడులో ఓ కుటుంబంలో తలెత్తిన సమస్య.. చివరికి చాలా దూరం వెళ్లింది. ఒంటరిగా జీవిస్తున్న ఇద్దరు పిల్లల తల్లి.. సభ్యసమాజం తలదించుకునేలా రెండు ఘోరమైన తప్పులు చేయడానికి కారణమైంది. ఈ కేసులో నిందితులను పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని తెన్ కాశీ జిల్లా శంకరన్‌కోయిల్ గ్రామానికి చెందిన ముతుమారి, మాడసామి దంపతులు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. పిల్లలు పుట్టిన కొన్ని నెలలకు దంపతుల మధ్య సమస్యలు తలెత్తాయి. ఈ గొడవలు రోజురోజుకూ పెద్దవి అవడంతో పిల్లలతో కలిసి ముతుమారి నోచికులం అనే గ్రామంలో కొన్ని నెలలుగా ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు వల్లరాంపురానికి చెందిన శవికుమార్‌తో పరిచయం ఏర్పడింది. రోజూ మహిళ ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో కొన్నాళ్లకు వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. 2018లో అతడి కారణంగా ఓ పాప పుట్టింది. దీంతో వారిద్దరూ ఆలోచనలో పడ్డారు.
శోభనాన్ని వాయిదా వేస్తున్న భర్త.. ఓ రోజు రాత్రి నిద్రపోతోందనుకుని ఫోన్లో అతడు మాట్లాడేది ఆమె విని..
ఈ విషయం బయట తెలిస్తే.. పరువు పోతుందని భయపడి, శిశువును గ్రామ సమీపంలోని చెరువులో పడేశారు. తర్వాత ఆ గ్రామం నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. 2019లో వీరిద్దరికీ మళ్లీ ఇంకో పాప జన్మించింది. అప్పుడు కూడా శిశువును హత్య చేసి వారి ఇంటి సమీపంలోనే పాతిపెట్టి వెళ్లిపోయారు. అప్పటినుంచి వారిద్దరూ పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నాలుగేళ్లుగా వారి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఇటీవలే వారిద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ వార్త చుట్టు పక్కల ప్రాంతాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.