మహిళ మిస్సింగ్‌ కేసును ఛేదించిన పోలీసులు

ABN , First Publish Date - 2021-01-14T06:14:56+05:30 IST

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నాలుగేళ్ల క్రితం మహిళ అదృశ్యమైన కేసును యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ పోలీసులు ఛేదించారు.

మహిళ మిస్సింగ్‌ కేసును ఛేదించిన పోలీసులు
మహిళను కుటుంబసభ్యులను అప్పగిస్తున్న పోలీసులు

 నాలుగేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళ అప్పగింత

నల్లగొండ క్రైం, జనవరి 13: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నాలుగేళ్ల క్రితం మహిళ అదృశ్యమైన కేసును యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ పోలీసులు ఛేదించారు. కుటుంబకలహాలతో  మిర్యాలగూడ పట్టణంలోని బంగారిగడ్డకు చెందిన కంచుకొమ్ముల ఇందు, నాలుగేళ్ల కుమారుడితో  2015లో ఇంటి నుంచి వెళ్లిపోయింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం ఇచ్ఛాపురంలో కూరగాయల వ్యాపారం చేస్తూ జీవిస్తోంది. యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌  టీం సీఐ సత్యం బృందం ఆధునిక టెక్నాలజీ ద్వారా ఇందును గుర్తించి అదుపులోకి తీసుకుని కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసును ఛేదించిన  సీఐ సత్యం, ఎస్‌ఐలు రాంబాబు, నాగుల్‌మీరా, కానిస్టేబుళ్లు నర్సింహ, మధు, నజీర్‌, బాలయ్య, సాయిసందీప్‌ను ఎస్పీ ఏవీ రంగనాథ్‌ అభినందించారు. 



Updated Date - 2021-01-14T06:14:56+05:30 IST