రైల్వే ట్రాక్ పక్కన మూడు ప్లాస్టిక్ బ్యాగుల్లో ఓ మహిళ శరీర భాగాలు.. ఒకే ఒక్క క్లూతో 14 గంటల్లోనే వీడిన మిస్టరీ..!

ABN , First Publish Date - 2022-05-26T22:22:26+05:30 IST

ప్రేమ వ్యవహారాలు, ఆస్తులు, ఆర్థిక లావాదేవీల విషయాల్లో నిత్యం దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు దుండగులు చిన్న చిన్న కారణాలకే అత్యాచారాలు, హత్యలకు తెగపడడం..

రైల్వే ట్రాక్ పక్కన మూడు ప్లాస్టిక్ బ్యాగుల్లో ఓ మహిళ శరీర భాగాలు.. ఒకే ఒక్క క్లూతో 14 గంటల్లోనే వీడిన మిస్టరీ..!
ప్రతీకాత్మక చిత్రం

ప్రేమ వ్యవహారాలు, ఆస్తులు, ఆర్థిక లావాదేవీల విషయాల్లో నిత్యం దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు దుండగులు చిన్న చిన్న కారణాలకే అత్యాచారాలు, హత్యలకు తెగపడడం చూస్తూనే ఉన్నాం. ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ పక్కన మహిళ శరీర భాగాలను మూడు ప్లాస్టిక్ బ్యాగుల్లో మూట కట్టి పడేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యా్ప్తు ప్రారంభించారు. ఒకే ఒక్క క్లూతో కేవలం 14 గంటల్లోనే మిస్టరీని ఛేదించారు. వివరాల్లోకి వెళితే..


ముంబైలోని మహిమ్‌, మాతుంగా రైల్వే స్టేషన్‌ల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్‌పై మూడు పెద్ద పెద్ద బ్యాగులు మూట కట్టి పడి ఉండడాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బ్యాగులు తెరచి చూడగా, మహిళ శరీర విడిభాగాలు బయటపడ్డాయి. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలూ లభించలేదు. ఈ క్రమంలో బ్యాగులపై 'హరి ఓం డ్రగ్ గోరేగావ్' అని రాసి ఉండడాన్ని గుర్తించారు. ఈ పేరు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించి.. కేవలం 14గంటల్లో కేసును ఛేదించారు. మృతురాలు గోరేగావ్ ఈస్ట్‌లోని శాటిలైట్ టవర్ హౌసింగ్ సొసైటీలో నివాసం ఉంటున్న సారిక దామోదర్ చల్కే (30)గా గుర్తించారు. నిందితుడు వికాస్ ఖైర్నార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు.

మూడ్రోజులుగా ఫోన్ లిఫ్ట్ చేయని తల్లిదండ్రులు.. అనుమానంతో ముంబై నుంచి వచ్చి చూసిన కూతురు.. ఇంటి తలుపులు పగలగొట్టి చూస్తే..


పోలీసుల కథనం మేరకు.. స్థానికంగా ఉన్న శాటిలైట్ టవర్‌లో మృతురాలు పని చేసేది. నిందితుడు కూడా అక్కడే హౌస్‌ కీపింగ్ విభాగంలో పని చేసేవాడు. ఈ క్రమంలో నిందితుడి వద్ద నుంచి సారిక కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకుంది. అయితే ఎన్నిసార్లు అడిగినా తిరిగి చెల్లించలేదు. ఈ క్రమంలో మంగళవారం వారి మధ్య ఈ విషయంలో మళ్లీ ఘర్షణ జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు.. ఆమెను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలుగా కోసి మూడు పెద్ద బ్యాగుల్లో నింపి, రైల్వే ట్రాక్‌పై పడేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె హత్యకు ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు స్థానికంగా సంచలనం సృష్టించింది.

ఎన్ని సార్లు చెప్పినా వినకుండా ప్రియుడితో సీక్రెట్‌గా ఫోన్లో మాట్లాడుతున్న కూతురు.. ఓ రోజు రాత్రి తండ్రి చూసి..

Updated Date - 2022-05-26T22:22:26+05:30 IST