తాళి కట్టిన తర్వాత ఎంటరైన పోలీసులు... కాసేపటికి భర్త స్థానంలో మరిది ప్రత్యక్షం... జరిగిన విషయం తెలుసుకుని అవాక్కయిన బంధువులు
ABN , First Publish Date - 2022-05-15T21:38:46+05:30 IST
తీరా తాళి కట్టే సమయంలో.. ఆపండి.. అంటూ ఎవరో ఒకరు ఎంటవరడం సినిమాల్లో చూస్తుంటాం. కొన్నిసార్లు నిజ జీవితంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కట్నం, ప్రేమ...
తీరా తాళి కట్టే సమయంలో.. ఆపండి.. అంటూ ఎవరో ఒకరు ఎంటవరడం సినిమాల్లో చూస్తుంటాం. కొన్నిసార్లు నిజ జీవితంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కట్నం, ప్రేమ వ్యవహారం తదితర సమస్యల కారణంగా వివాహ కార్యక్రమాల్లో గొడవలు జరుగుతుంటాయి. ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. తాళి కట్టిన తర్వాత కథ అడ్డం తిరిగింది. దీంతో భర్త స్థానంలో మరిది ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా పరిధి తాజ్‌గంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న ఓ వ్యాపారవేత్తకు 2012 ఫిబ్రవరిలో వివాహమైంది. అయితే వేధింపుల కారణంగా 2017లో అతడి భార్య కోర్టులో కేసు వేసింది. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. కేసు కోర్టులో ఉండడంతో ప్రస్తుతం వీరు విడివిడిగా ఉంటున్నారు. ఇదిలావుండగా సదరు వ్యాపారవేత్త ఇటీవల ఇంకో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య బంధువులు పెళ్లి మంటపానికి చేరుకున్నారు. అయితే అప్పటికే తాళి కట్టే తంతు కూడా పూర్తయింది.
చలనం లేకుండా పడి ఉన్న తల్లి పక్కన 6నెలల చిన్నారి ఒకటే ఏడుపు.. స్థానికులు కంగారుగా వెళ్లి చూడగా..
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. మొదటి భార్యతో విడాకులు తీసుకోకుండానే పెళ్లికి సిద్ధమైనట్లు తెలియడంతో అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. అయితే యువతి అన్యాయం జరగడంతో పెద్దలంతా కూర్చుని పంచాయితీ చేశారు. చివరకు వ్యాపారవేత్త సోదరుడితో యువతికి వివాహం జరిపించారు. దీంతో అప్పటిదాకా మరిదిగా ఉన్న వ్యక్తి కాస్త.. ఊహించని ఘటనతో భర్తగా మారాల్సి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.