పోలీసుల సన్నద్ధం

ABN , First Publish Date - 2020-11-14T06:05:38+05:30 IST

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం కావ డంతో పోలీస్‌ అధికారులు అందుకు అనుగుణంగా సన్నద్ధమవుతున్నారు.

పోలీసుల సన్నద్ధం

అనకాపల్లితో పాటు పాడేరుల్లో ఎస్పీ కార్యాలయాలు

ఆర్ముడ్‌ రిజర్వుడ్‌ సిబ్బంది, ఆయుధాగారాల ఏర్పాటు

ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు

మావోయిస్టు  పభావితమైన అరకులోయ జిల్లాకు ప్రత్యేక బలగాల కోసం వినతి

విశాఖ పోలీస్‌ కమిషనరేట్‌లోనే పెందుర్తి, పరవాడ స్టేషన్లు?


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం కావడంతో పోలీస్‌ అధికారులు అందుకు అనుగుణంగా సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం వున్న విశాఖ జిల్లాలో కొత్తగా అనకాపల్లి, అరకులోయ జిల్లాలు ఏర్పాటుకా నున్నాయి. విశాఖ నగరం పోలీస్‌ కమిషనరేట్‌ పరిఽ దిలో ఉంటుంది. రూరల్‌లో అనకాపల్లి, అరకులోయ పోలీస్‌ జిల్లాలు ఏర్పాటవుతాయి. ప్రస్తుతం నగర పరిఽ దిలో వున్న పెందుర్తి, పరవాడ మండలాలు అనకాపల్లి జిల్లాలో కలవనున్నాయి. అయితే ఈ రెండుచోట్ల పోలీస్‌ స్టేషన్లు మాత్రం విశాఖ పోలీస్‌ కమిషనరే ట్‌లోనే కొనసాగించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.  ఇక అనకాపల్లి ఎస్పీ కార్యాలయం పరిధిలో పెందుర్తి, అనకాపల్లి, ఎలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం పోలీస్‌ సబ్‌ డివిజన్లు ఉంటాయి. నర్సీపట్నంలో ఓఎస్‌డీ ఉంటారు. ఎలమంచిలి, పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిశ్రమలు పెరుగుతున్నం దున పోలీస్‌ మరో సబ్‌ డివిజన్‌ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నారు. అలాగే పాడేరు, అరకు అసెంబ్లీ సెగ్మెంట్‌లతో అరకులోయ జిల్లా ఏర్పాటవుతుంది. అయితే పాడేరు జిల్లా కేంద్రంగా మారే అవకాశం ఉంది. అరకు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని రంప చోడవరాన్ని తూర్పు గోదావరిలో కొత్తగా ఏర్పాటు కానున్న రాజమండ్రి జిల్లాలో విలీనం చేయనున్నారు.   ఇక విజయనగరం, శ్రీకాకుళంలో జిల్లాల్లో వున్న నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్‌లతో పార్వతీపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటుచేస్తారు.


కొత్తగా ఏర్పాటవుతున్న జిల్లా కేంద్రాల్లో ఎస్పీలతో పాటు ఆర్ముడ్‌ రిజర్వు, ఇతర విభాగాలు, ఆయుధా గారం ఉండాలి. ప్రస్తుతం విశాఖ నగరంలో వెయ్యి మంది, రూరల్‌లో 800 మంది ఆర్ముడ్‌ రిజర్వు సిబ్బం ది ఉన్నారు. రూరల్‌లో వున్న 800 మందిలో కొంతమం దిని అనకాపల్లి, మరికొందరిని అరకు జిల్లాకు కేటా యించే అవకాశం ఉందంటున్నారు. అరకు జిల్లా పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. అరకు, పాడేరు సెగ్మెంట్‌ల పరిధిలో గల 11 మండలాల్లో మావోయిస్టులు కార్యకలాపాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అరకు జిల్లాకు  ప్రత్యేకంగా అదనపు బల గాల కోసం ప్రతిపాదించారు. కూంబింగ్‌కు పారామిల టరీ బలగాలకు తోడు ప్రత్యేకంగా బలగాలు అవసర మని ఉన్నతాఽధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం విశాఖ నగరం, రూరల్‌ జిల్లాల్లో గల ఆర్మ్‌డ్‌ రిజర్వు సిబ్బందిలో యువకులను కొన్నాళ్లు అరకు జిల్లాకు పంపాలని యోచిస్తున్నారు. పదేళ్లపాటు పనిచేసిన తరువాత తిరిగి విశాఖపట్నం/అనకాపల్లికి తీసుకురావాలనుకుంటున్నారు. కాగా అనకాపల్లి, అరకు జిల్లాలకు ఆర్ముడ్‌ రిజర్వు సిబ్బందితో పాటు ఎస్పీ కార్యాలయానికి మౌలిక సదుపాయాలు, క్వార్టర్స్‌ వంటివి సమకూర్చుకోవలసి ఉంటుంది. ప్రధానంగా ఆయుధాగారం ఏర్పాటు అత్యంత కీలకమైనది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కొత్త పోలీస్‌ జిల్లాల ఏర్పాటుపై ప్రతిపాదనలు పంపారు. పాడేరు, అనకాపల్లిలో మౌలిక వసతులు ఏర్పాటుచేసేంత వరకు సిబ్బంది కైలాసగిరిలోని రిజర్వు క్వార్టర్స్‌లో వుండడం అనివార్యమని అంటున్నారు. అరకు జిల్లాలో మౌలిక వసతుల కోసం కేంద్రం  మావోయిస్టు ప్రభావిత విభాగం నుంచి నిధులు ఇచ్చే అవకాశం ఉంది. అరకు జిల్లా వరకు పోలీసులకు వసతులు, వాహనాలు, ఆయుధాలు సమకూర్చుకోవడం పెద్ద ఇబ్బంది వుండబోదని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

Updated Date - 2020-11-14T06:05:38+05:30 IST