Advertisement
Advertisement
Abn logo
Advertisement

అర్ధనగ్నంగా చిందులు, విందులు, వినోదాలు.. ఆయన లైఫ్ స్టైలే వేరు.. ఎవరో తెలిస్తే shok అవుతారు..!

అవును ఆయన లైఫ్ స్టైలే వేరు. డ్యూటీకి వచ్చేటప్పుడు బాగానే ఉంటాడు. తర్వాత స్టార్ట్ అవుతుంది అసలు ప్రోగ్రాం.. ఆ సమయంలో ఎలాంటి రూల్స్ ఉండవు. కేవలం ఎంజాయ్‌మెంట్ తప్ప. మందుతో విందు చేసుకుంటాడు. ఆ సమయంలో మ్యూజిక్ కూడా విధిగా ఉండాలి. పక్కన అనుచరులు ఉంటూ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఇలాంటి సెటప్‌లో విందు చేసుకోవడం ఆయనకు హాబీ.. ఆయన మామూలు వ్యక్తి అయితే ఇంత చెప్పనవసరం లేదు. ఉన్నతమైన స్థానంలో ఉన్న ఆయన.. పదిమందికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి.. ఛీ ఛీ అనిపించుకుంటున్నాడు.. వివరాల్లోకి వెళితే..

తమిళనాడులోని మధురైలో సాయుధ పోలీసు దళం ( రిజర్వ్ పోలీస్)లో అసిస్టెంట్ పోలీసు కమీషనర్, డీఎస్పీలు, ఇన్స్ పెక్టర్లు, ఎస్ఐలతో పాటు సుమారు వెయ్యి మంది పోలీసులు ఉన్నారు. ఇక్కడే అసిస్టెంట్ పోలీసు కమిషనర్ గా (ACP)సోమసుందరం ఉద్యోగం చేస్తున్నారు. ఇంతటి హోదాలో ఉన్న ఆయనకు.. ఇలాంటి దురలవాటు ఏంటి.. అని అంతా అసహ్యించుకుంటున్నారు. డ్యూటీ సమయంలో మామిడితోటకు వెళ్లడం, ఒంటిపై దుస్తులన్నీ విప్పి, కేవలం డ్రాయర్‌తో ఫుల్ బాటిల్ ఒపెన్ చేసి పీకలదాకా తాగడం ఆయనకు అలవాటు. ఈ సమయంలో విధిగా మ్యూజిక్ ఉండాలట. 

ఓ కానిస్టేబుల్‌కు పిల్లనగ్రోవి వాయించడం అలవాటు. ఇంకేముంది ఆయన్ను తన వెంటే పెట్టుకుని.. పిల్లనగ్రోవి వాయిస్తుంటే వింటూ.. మందేస్తుంటాడట. సాటి ఉద్యోగులు ఎంత చెప్పినా వినేవాడు కాదట. చివరకు ఓ వ్యక్తి ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. దీంతో తమిళనాడు పోలీసు శాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు. సోమసుందరం వ్యవహారంపై విచారణ చేసి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని సమాచారం. ఇది తెలిసి.. సోమసుందరం అంటే నచ్చని వారు తెగ సంతోష పడుతున్నారట.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement