Advertisement
Advertisement
Abn logo
Advertisement

గర్లఫ్రెండ్ గొంతెమ్మ కోరికలతో విసిగిపోయిన ప్రియుడు.. చివరికి ఆమెను ఏం చేసాడంటే..

ఈ కాలంలో గర్లఫ్రెండ్స్ ఉండడం యువతకి సరదాగా మారిపోయింది. కానీ కొన్నిసార్లు ఇలాంటి సరదాలు దారుణ పరిస్థితులకు దారితీస్తాయి. పెళ్లైన ఓ యవకుడికి మరో యువతితో సంబంధం ఉంది. ఆమె తరుచూ ఖరీదైన కానుకలు కొనివ్వమని అతడిని వేధించేది. రోజువారీ కూలీకి పనిచేసే ఆ యువకునికి ఎంత తప్పు చేశాడో తెలిసి వచ్చింది. కానీ కొనివ్వకపోతే ఆమె బెదిరించేది.. ఏం చేయాలో తోచక చివరికి ఆమెను ఏం చేసాడంటే..

గుజరాత్‌లోని జంబుఘోడాకు చెందిన పంచల్ అనే యువకుడికి ఇంతకు ముందే వివాహమైంది. అతడు ఒక ఇంజనీరింగ్ కంపెనీలో వెల్డర్‌గా పనిచేస్తూ రోజుకు రూ.350 సంపాదిస్తాడు. పెళ్లి తరువాత కూడా పంచల్ మరో యువతి బరియాతో సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరూ కొన్నిరోజులు సరదాగా గడిపారు. బరియా ఏది అడిగినా కాదనేవాడు కాదు. ఆమె తరుచూ పంచల్‌ని షాపింగ్‌కు తీసుకెళ్లమని అడిగేది. పంచల్ కూడా వీలైనప్పుడల్లా బరియాను షాపింగ్‌కు తీసుకెళ్లి ఏదికావాలన్నా కొనిచ్చేవాడు.

ఇలా కొద్దికాలం గడిచాక, పంచల్‌కు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. దీంతో బరియాకు అడిగే ఖరీదైన కానుకల కొనిచ్చేందుకు వీలుపడదని చెప్పాడు. కానీ బరియా మొండిగా తనకు కావాల్సినవి కొనివ్వాల్సిందే అని గొడవపడేది.. లేకపోతే తమ వివాహేతర సంబంధం గురించి పంచల్ భార్య, కుటుంబానికి చెప్పేస్తానని బెదిరించింది. దీంతో పంచల్ ఇరకాటంలో పడిపోయాడు. ఇలా చాలాసార్లు జరిగింది.

బరియా అడిగే గొంతెమ్మ కోరికలతో విసిగిపోయిన పంచల్ ఆమెను చంపేదామని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు ఆమెను ఎవరూలేని ప్రదేశానికి తీసుకెళ్లి బ్లేడుతో గొంతుకోసి చంపేశాడు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయాడు. కానీ పోలీసులు అతడిని పట్టుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు. ఇప్పుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు జైలులో మగ్గుతున్నాడు.

ఇలా కొద్దికాలం గడిచాక, పంచల్‌కు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. దీంతో బరియాకు అడిగే ఖరీదైన కానుకల కొనిచ్చేందుకు వీలుపడదని చెప్పాడు. కానీ బరియా మొండిగా తనకు కావాల్సినవి కొనివ్వాల్సిందే అని గొడవపడేది.. లేకపోతే తమ వివాహేతర సంబంధం గురించి పంచల్ భార్య, కుటుంబానికి చెప్పేస్తానని బెదిరించింది. దీంతో పంచల్ ఇరకాటంలో పడిపోయాడు. ఇలా చాలాసార్లు జరిగింది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement