ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి

ABN , First Publish Date - 2021-07-30T04:27:35+05:30 IST

సచివాలయాల ద్వారా పంచాయతీ వ్యవస్థలో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు రికార్డులను ఎప్పటికప్పుడు సరిగ్గా నిర్వహించాలని సచివాలయ ఉద్యోగులు, సిబ్బందిని డీపీవో ధనలక్ష్మి ఆదేశించారు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి
దామరమడుగు సచివాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న డీపీవో ధనలక్ష్మి

సచివాలయ ఉద్యోగులతో డీపీవో ఽధనలక్ష్మి 


బుచ్చిరెడ్డిపాళెం, జూలై 29: సచివాలయాల ద్వారా పంచాయతీ వ్యవస్థలో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు రికార్డులను ఎప్పటికప్పుడు సరిగ్గా నిర్వహించాలని సచివాలయ ఉద్యోగులు, సిబ్బందిని డీపీవో ధనలక్ష్మి ఆదేశించారు. గురువారం దామరమడుగు సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు.  ప్రతి సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్‌ విధానం పాటించాలన్నారు. కరోనా కేసులు నమోదైతే వెంటనే కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటుపై పలు సూచనలిచ్చారు. ఆగస్టు 15 నుంచి స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం చేపట్టనున్న నేపథ్యంలో ఎంపీడీవో, ఈఓపీఆర్డీకి పలు సూచనలు చేశారు.  

Updated Date - 2021-07-30T04:27:35+05:30 IST