Prakasam జిల్లాలో తప్పిన ప్రమాదం
ABN , First Publish Date - 2021-12-15T17:24:31+05:30 IST
ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బల్లిపల్లి సమీపంలో పెను ప్రమాదం తప్పింది.
ఒంగోలు: ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బల్లిపల్లి సమీపంలో పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై గ్యాస్ సిలిండర్ల లారీకి ప్రమాదం జరిగింది. కనిగిరి నుంచి పామూరుకు వెళ్తుండగా లారీ అదుపుతప్పి వంతెనను ఢీకొట్టింది. దీంతో హైవేపై సిలిండర్లు పడిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సిలిండర్లను లారీలోకి ఎక్కించే చర్యలు చేపట్టారు.