గర్భిణులకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ టీకాలు వేయాలి

ABN , First Publish Date - 2021-10-24T04:12:50+05:30 IST

బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌ ఉమ్మడి మండలా ల్లో గర్భిణులను గుర్తించి వారికి కరోనా టీకాలను వేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌ వైద్య సిబ్బందిని ఆదేశించారు.

గర్భిణులకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ టీకాలు వేయాలి
పోతారంలో కరోనా వ్యాక్సిన్‌ వేస్తున్న దృశ్యం

డిప్యూటీ డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌
బీర్కూర్‌, అక్టోబరు 23: బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌ ఉమ్మడి మండలా ల్లో గర్భిణులను గుర్తించి వారికి కరోనా టీకాలను వేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌ వైద్య సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఆయన బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌ ఉమ్మడి మండలాల్లో పర్యటించి, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌ ఉమ్మడి మండలాల్లో నూటికి నూరు శాతం ఈ నెల 25 లోపు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తి చేయాల న్నారు. ఏఏ గ్రామాల్లో తక్కువ స్థాయిలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ టీకాలు వేశారో గుర్తించి అక్కడ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి కరోనా టీకాలు వేయాలన్నారు. ప్రజ లకు కరోనా టీకాల వల్ల కలిగే ప్రయోజనాల గురి ంచి వివరించి, వారికి టీకాలు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. బీర్కూర్‌ పీహెచ్‌సీ పరిధిలో ఇప్ప టి వరకు 31,900 మందికి మొదటి డోసు టీకాలు ఇచ్చారని, 8,700 మందికి సెకండ్‌ డోసు ఇచ్చారని, మొత్తం 40,600మందికి టీకాలు వేశారన్నారు. ఉమ్మడి మండలాల పరిధిలో 995 మందికి టీకాలు వేయాల్సి ఉందని, వారికి వెంటనే టీకాలు వేయాలన్నారు. ఆయన వెంట మండల వైద్యాధికారి రాజా రమేష్‌, సిబ్బంది రాములు, సాయమ్మ, రాయల్‌ హుస్సేన్‌, రేఖ, సరిత తదితరులున్నారు.
పోతారంలో ఇంటింటికీ వాక్సిన్‌
మాచారెడ్డి: మండలంలోని పోతారం గ్రామంలో శనివారం ఇంటింటికీ తిరుగుతూ కరోనా వ్యాక్సిన్‌ వేశారు. కరోనా వైరస్‌ను నియత్రించడానికి ప్రతీ ఒక్కరికి కరోనా వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమాన్ని వైద్య సిబ్బంది చేపట్టారు. ఈ కార్యక్రమంలో  సర్పంచ్‌ గ్యార డ్రైవర్‌ సాయిలు, ఉప సర్పంచ్‌ సూర రవికుయార్‌, ఏఎన్‌ఎం యశోద, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌, ఆశ కార్యకర్త గంగామణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T04:12:50+05:30 IST