కొవిడ్‌ ఆసుపత్రుల్లో అన్నీ సిద్ధం చేయండి : కలెక్టర్‌ ముత్యాలరాజు

ABN , First Publish Date - 2020-04-09T12:29:48+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ ఆసుపత్రులుగా గుర్తించిన జిల్లా కేంద్ర ఆసుపత్రి, ఆశ్రం ఆసుపత్రులలో కొవిడ్‌ చికిత్సకు

కొవిడ్‌ ఆసుపత్రుల్లో అన్నీ సిద్ధం చేయండి : కలెక్టర్‌ ముత్యాలరాజు

ఏలూరు ఏప్రిల్‌ 8, (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాలో కొవిడ్‌ ఆసుపత్రులుగా గుర్తించిన జిల్లా కేంద్ర ఆసుపత్రి, ఆశ్రం ఆసుపత్రులలో కొవిడ్‌ చికిత్సకు అవసరమైన అన్నిరకాల పరికరాలు, మందులు, మాస్కులు, గ్లౌజులను పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంచాలని కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు నోడల్‌ అధికారులను ఆదేశించారు. నోడల్‌ అధికారులు, వైద్యులు, ఆశ్రం ఆసుపత్రి యాజ మాన్యం ప్రతినిధులతో బుధవారం కలెక్టర్‌ సమీక్షించారు. క్వారంటైన్‌, కొవిడ్‌ ఆసు పత్రుల్లో వైద్యులు, సిబ్బంది అప్ర మత్తతతో విధులు నిర్వర్తించాలన్నారు.


ఆసుపత్రి వైద్యులు, నర్సులు, సెక్యూరిటీ, హౌస్‌కీపింగ్‌ సిబ్బంది అందరూ విధులకు సక్ర మంగా హాజరు కావాలన్నారు. ఎవరైనా హాజరు కానిపక్షంలో చర్యలు తీసుకుం టామన్నారు. ఆసుపత్రులలో ఎటు వంటి అసౌకర్యం లేకుండా చూడాలని సూచిం చారు. వివిధ ప్రైవేటు ఆసు పత్రులలో గుర్తించిన 36 ఐసీయు యూనిట్లలో 19 జిల్లా ఆసుపత్రికి, 17 ఆశ్రం ఆసుపత్రికి తరలించాలని బయోమెడికల్‌ ఇంజనీర్లను కలెక్టర్‌ ఆదేశించారు. క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్న వారందరికీ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహిం చడంతో పాటు వారికి టిఫిన్‌, టీ, కాఫీ భోజనాలు సకాలంలో అందేలా చూడా లన్నారు.


క్వారంటైన్‌ సెంటర్‌లో సౌకర్యాలపై ఎటువంటి ఫిర్యా దులు రానివిధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.  జేసీ కె.వెంకటరమణారెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హిమాన్సు కౌషిక్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుబ్రహ్మణ్యేశ్వరి, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ శంకర్‌రావు,ఆశ్రం ఆసు పత్రి మేనేజ్‌ మెంట్‌ ప్రతినిధులు, క్వారంటైన్‌ సెంటర్ల నోడల్‌ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-09T12:29:48+05:30 IST