అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ఆరోపణలు

ABN , First Publish Date - 2022-04-10T07:12:50+05:30 IST

చేసిన తప్పులతో పాటు లక్ష కోట్ల రూపాయల అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు బీజేపీపై నిందారోపణలు చేస్తూ కుటిల రాజకీయం చేస్తున్న సీఎం కేసీఆర్‌కు చిప్పకూడు తప్పదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఎడప ల్లి మండల కేంద్రంలో శనివారం రైతు సదస్సు నిర్వహించారు.

అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ఆరోపణలు
మాట్లాడుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి

త్వరలోనే సీఎం కేసీఆర్‌కు చిప్పకూడు తప్పదు

ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి 

బోధన్‌ రూరల్‌/ఎడపల్లి, ఏప్రిల్‌ 9: చేసిన తప్పులతో పాటు లక్ష కోట్ల రూపాయల అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు బీజేపీపై నిందారోపణలు చేస్తూ కుటిల రాజకీయం చేస్తున్న సీఎం కేసీఆర్‌కు చిప్పకూడు తప్పదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఎడప ల్లి మండల కేంద్రంలో శనివారం రైతు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమెతో పాటు ఎంపీ ధర్మపురి అర్వింద్‌  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్‌ ఒకేసారి అధికారంలోకి వచ్చారన్నారు. గత ఏడేళ్లలో రాష్ట్రం ధాన్యం కొనుగోలు చేస్తున్నామంటూ  రైతులను మభ్యపెట్టారని, ఈ ఏడాదిలోనే కేంద్ర ప్రభుత్వం ఽధాన్యం కొనుగోలు చేయడం లేదని సీఎం కేసీఆర్‌ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికలో కోట్లాది రూపాయలను ఖర్చు చేసిన సీఎం కేసీఆర్‌కు ఓటమి తప్పలేదని, ప్రజలు తమదైన శైలిలో బుద్ది చెప్పడం కేసీఆర్‌కు కలవరపాటుకు గురి చేసిందన్నారు. నాటి నుంచి సీఎం కేసీఆర్‌ వ్యవహార శైలిలో మార్పు రాగా బీజేపీ భయం పట్టుకుందన్నారు. ఏడేళ్ల పాలనలో లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన సీఎం కేసీఆర్‌ తన తప్పులను  కప్పిపుచ్చుకునేందుకు బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.  

సైనికులను సైతం అవమానించారు : ఎంపీ అర్వింద్‌

దేశం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సైనికుల చర్యను అవమానించడంతో పాటు రైతులను మోసం చేయడంతో సీఎం కేసీఆర్‌ దేశ, రైతుల ద్రోహిగా మారారని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఆరోపించారు. రైతు సదస్సులో ఎంపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ దేశ త్రివిధ దళాలను అవమానించారన్నారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ,  జిల్లా ఇన్‌చార్జి మీసాల చంద్రయ్య, ఆదిలాబాద్‌ ఇన్‌చార్జి అల్జాపూర్‌ శ్రీనివాస్‌, కామారెడ్డి   అధ్యక్షురాలు అరుణతార,  కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మేడపాటి ప్రకాష్‌రెడ్డి,  జిల్లా ఇన్‌చార్జి మురళీధర్‌గౌడ్‌, జిల్లా అధ్యక్షుడు బసవలక్ష్మీ నర్సయ్య, రెంజల్‌ ఎంపీపీ, జడ్పీటీసీ రజినీ, విజయ, జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి యాసాడ నర్సింగ్‌,  తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-04-10T07:12:50+05:30 IST