కేవడియాకు 8 ప్రాంతాల నుంచి రైళ్లు

ABN , First Publish Date - 2021-01-18T07:38:59+05:30 IST

గుజరాత్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఐక్యతా విగ్రహం ఉన్న కేవడియాను దేశంలోని వివిధ ప్రాంతాలకు అనుసంధానిస్తూ ఎనిమిది రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

కేవడియాకు 8 ప్రాంతాల నుంచి రైళ్లు

ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించిన ప్రధాని 



అహ్మదాబాద్‌, జనవరి 17: గుజరాత్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఐక్యతా విగ్రహం ఉన్న కేవడియాను దేశంలోని వివిధ ప్రాంతాలకు అనుసంధానిస్తూ ఎనిమిది రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆదివారం ఆన్‌లైన్‌ ద్వారా ఈ రైళ్లకు ఆయన జెండా ఊపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాలో ఉన్న స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ కన్నా కేవడియాలోని పటేల్‌ ఐక్యతా విగ్రహం మరింత మంది పర్యాటకులను ఆకర్షిస్తుందని అన్నారు. గుజరాత్‌లోని ఓ కుగ్రామంలో ఉన్న కేవడియా నేడు ఏమాత్రం చిన్న ప్రదేశం కాదని, ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక గమ్యస్థానంగా కేవడియా ఎదుగుతోందని వ్యాఖ్యానించారు.  

Updated Date - 2021-01-18T07:38:59+05:30 IST