అయోధ్య రామాలయానికి శంకుస్థాపన చేసిన మోదీ

ABN , First Publish Date - 2020-08-05T18:12:03+05:30 IST

భారత చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాలుగా కోట్లాది మంది నిరీక్షిస్తున్న...

అయోధ్య రామాలయానికి శంకుస్థాపన చేసిన మోదీ

అయోధ్య: భారత చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాలుగా కోట్లాది మంది నిరీక్షిస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ భూమిపూజ గావించి, శంకుస్థాపన చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రధాని మోదీ భూమిపూజ కార్యక్రమాన్ని జరిపించారు. ముహూర్తం ప్రకారం సరిగ్గా మధ్యాహ్నం 12.44.08కి ఆయన శంకుస్థాపన చేశారు. పూజ అనంతరం ఆయన వేదికపై జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. కాగా భూమి పూజకు ముందు ప్రధాని మోదీ హనుమాన్‌గర్హి మందిరంలో పూజలు నిర్వహించారు. రాంలల్లా విగ్రహాన్ని దర్శించుకుని పూజలు ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీ బెన్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కోవిడ్19 నిబంధనల నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పూర్తి సామాజిక దూరాన్ని పాటించడంతో పాటు అందరూ మాస్కులు ధరించారు. కొద్దిమందిని మాత్రమే కార్యక్రమానికి ఆహ్వానించారు.



Updated Date - 2020-08-05T18:12:03+05:30 IST