Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ దేశాభివృద్ధికి చేటు

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ

కూర్మన్నపాలెం, నవంబరు 29: ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే దేశాభివృద్ధి ప్రశ్నార్థకంగా మారుతుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 291వ రోజు కొనసాగాయి. సోమవారం ఈ దీక్షలలో  ఎంఎంఎస్‌ఎం, డబ్ల్యూఆర్‌ఎం-2, ఎస్‌టీఎం, ఎస్‌బీఎం విభాగాల కార్మికులు కూర్చున్నారు. ఈ శిబిరంలో ఆదినారాయణ మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.  విజయవాడకు చెందిన ఏపీఎస్‌ ఆర్టీసీ నాయకుడు జి.సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలతో కార్మికులు ఇబ్బందిపడుతున్నారని పేర్కొన్నారు. ఈ శిబిరంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు యు.వెంకటేశ్వర్లు, గంధం వెంకటరావు, జి.ఆనంద్‌, దేముడు, రాజు, సూరిబాబు, సుబ్బారావు, శ్రీనివాస్‌, రమణారావు, మహ్మద్‌, గంగవరం గోపి తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement