ఆలస్యంగా ప్రారంభించడంతో ఇబ్బందులు

ABN , First Publish Date - 2021-10-17T05:52:07+05:30 IST

ఖరీ్‌ఫలో సాగు చేసిన పం టల వివరాలను నమోదు చేసేందుకు వ్యవసాయ సిబ్బంది పాట్లు పడుతున్నారు.

ఆలస్యంగా ప్రారంభించడంతో ఇబ్బందులు
అనంతపురం రూరల్‌ మండలంలోని పొలాల్లో పంటల నమోదు చేస్తున్న వ్యవసాయ సిబ్బంది

పంటల నమోదుకు పాట్లు..!

ఆలస్యంగా ప్రారంభించడంతో ఇబ్బందులు 

ఖరీఫ్‌ సీజన ముగిసే వారంరోజుల ముందు ఆరంభం

రేపటితో ముగియనున్న గడువు

సాంకేతిక సమస్యలతో సిబ్బంది సతమతం  

అనంతపురం వ్యవసాయం, అక్టోబరు 16: ఖరీ్‌ఫలో సాగు చేసిన పం టల వివరాలను నమోదు చేసేందుకు వ్యవసాయ సిబ్బంది పాట్లు పడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన ముగిసే వారంరోజుల ముందు ఆలస్యంగా పొలాల్లో ఫొటోలు తీసి, ఈ-క్రాపింగ్‌ చేయడం ప్రారంభించారు. అంతకుముందు రైతుల పేర్ల రిజిస్ర్టేషన, ఈ-కేవైసీ చేయాలని రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఆ పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. సర్వ ర్‌ సమస్యతో ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగింది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి లో పంట, రైతు ఫొటో తీసి, యాప్‌లో అప్‌లోడ్‌ చేసే ఈ క్రాపింగ్‌ ప్ర క్రియ ఆలస్యంగా ప్రారంభించారు. ఈ ఏడాది జూనలో సాగు చేసిన వేరుశనగ పంట కోతలు పూర్తయ్యాయి. దసరా పండుగ తర్వాత మిగిలిన విస్తీర్ణంలో పంట కోతలు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 12వ తేదీలోగా ఈ-క్రాపింగ్‌ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇంకా పూర్తికాకపోవడంతో ఈనెల 18వతేదీ వరకు గడువు పొడిగించారు. అప్పటిలోగా ఈ-క్రాపింగ్‌ పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చే శారు. తక్కువ సమయం ఇవ్వడంతో ఈ-క్రాపింగ్‌ చేయడంలో సిబ్బంది అవస్థలు పడుతున్నారు. సెలవు రోజుల్లోనే అదే పనిలో నిమగ్నమయ్యారు.


సాంకేతిక సమస్యలతో సతమతం 

పంటల వివరాలు నమోదు చేసేందుకు తయారు చేసిన కొత్త యాప్‌లో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో క్షేత్రస్థాయి సిబ్బంది సతమతమవుతున్నారు. పంట సాగు చేసిన పొలంలో రైతు ఫొటోను తీసిన తర్వాత అప్‌లోడ్‌ సక్సెస్‌ అయినట్లు డిస్‌ప్లే కావాలి. సర్వర్‌ సమస్యతో ఫొటో తీసిన తర్వాత ఆలస్యంగా అప్‌లోడ్‌ సక్సెస్‌ అయినట్లు సమాచారం వస్తోంది. కొందరు రైతులకు ఫొటో తీసి న ఒకట్రెండు రోజుల తర్వాత సక్సెస్‌ అయినట్లు సమాచారం వస్తుండటంతో సిబ్బంది అయోమయానికి లోనవుతున్నారు. ఈ-క్రా పింగ్‌ పూర్తి చేసిన తర్వాత ఒక మండలంలో ఏయే పంటలు, ఎంత విస్తీర్ణంలో ఈ-క్రాపింగ్‌ చేశారన్న సమాచారం యాప్‌లో డిస్‌ప్టే కావడం లే దు. కేవలం అన్ని పం టలు కలిపి మొత్తం విస్తీర్ణాన్ని చూపిస్తోంది. ప్రస్తు తం నల్లరేగడి భూములున్న 28 మండలాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో పప్పుశనగ పంపిణీ చేస్తున్నారు. పది రోజులుగా పప్పుశనగ పంపిణీకి రైతుల రిజిస్ర్టేషన ప్రక్రియ కొనసాగుతోంది. ఆయా ప్రాంతాల్లో పనిచేసే వ్యవసాయ సిబ్బందే రైతుల పేర్లు రిజిస్ర్టేషన చేసుకోవడం, డబ్బు కట్టించుకోవడంతోపాటు తాజాగా విత్తన పంపిణీ చేస్తున్నారు. దీంతో ఆయాప్రాంతాల్లో ఈ-క్రాపింగ్‌ చేసేందుకు పొలాల్లోకి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. మిగతా ప్రాంతాల్లో రైతుభరోసా కేంద్రాల్లో ఎరువుల విక్రయాలు కొనసాగుతున్నాయి. పలు రకాల పనులు ఒకేసారి చేయాల్సి రావడం, ఈ-క్రాపింగ్‌కు తక్కువ సమ యం ఇవ్వడంతో సిబ్బంది పడరాని పాట్లు పడుతున్నారు.


87 శాతం పూర్తి 

జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌ సీజనలో 20.82 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఇప్పటి దాకా 18.04 లక్షల ఎకరాల్లో (87శాతం)ఈ క్రాపింగ్‌ పూర్తి చేశారు. ఇంకా 2.78 లక్షల ఎకరాల్లో చేయాల్సి ఉంది. జిల్లాలో 561272 మంది రైతులతో ఈకేవైసీ చేయాల్సి ఉండగా.. ఇప్పటిదాకా 469567 మందితో (84 శాతం) చేయించారు. ఇంకా 91705 మందితో చేయాల్సి ఉంది. సర్వర్‌ సమస్య ఎక్కువగా ఉండటంతో ఈకేవైసీ పూర్తిస్థాయిలో చేయలేకపోయారు. ఈ-క్రాపింగ్‌ చేయడంతోపాటు రైతులతో ఈకేవైసీ చేయిస్తేనే ప్రభుత్వం అందించే పంటల బీమా, పంటనష్టపరిహారానికి అర్హులవుతారు. ఈ పరిస్థితుల్లో సకాలంలో ఈ-క్రాపింగ్‌ పూర్తిచేయడంతోపాటు ఈకేవైసీని పూర్తి చేయాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి సవ్యంగా ఈ-క్రాపింగ్‌, ఈకేవైసీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే రైతులు నష్టపోవాల్సి వస్తుంది. మరి ఏ మేరకు అధికార యంత్రాంగం చొరవ చూపుతుందో వేచిచూడాల్సిందే.

Updated Date - 2021-10-17T05:52:07+05:30 IST