Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిర్మాత జక్కుల నాగేశ్వరరావు దుర్మరణం

 పమిడిముక్కల : మండలంలోని  తాడంకి వద్ద మచిలీపట్నం - విజయవాడ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నిర్మాత, యూట్యూబ్‌ చానల్‌ నిర్వాహకుడు జక్కుల నాగేశ్వరరావు(46) దుర్మరణం చెందాడు. రంగారెడ్డి జిల్లా ఎర్రగడ్డ నందన్‌ నగర్‌కు చెందిన నాగేశ్వరరావు హైదరాబాద్‌ నుంచి భార్యతో కలిసి కంకిపాడు మండలం నెప్పల్లి గ్రామానికి మూడు రోజుల క్రితం వచ్చాడు. గురువారం ముదినేపల్లి వెళుతుండగా, ఉదయం 11.30 గంటల సమయంలో తాడంకి వద్ద తన కారులోని స్టెఫిన్‌ టైరుకు గాలి పెట్టిస్తూ సెల్‌ఫోన్‌ మాట్లాడుతున్నాడు. మచిలీపట్నం నుంచి విజయవాడ  వస్తున్న మరో కారు నాగేశ్వరరావు ఢీ కొట్టింది. ఆయన సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. నాగేశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పమిడిముక్కల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఈయన  వీడు సరైనోడు కాడు, అమ్మానాన్న ఊరెళితే, లవ్‌ జర్నీ సినిమాలు నిర్మించారు.

 

Advertisement
Advertisement