Abn logo
Sep 18 2021 @ 23:40PM

వీఆర్‌ఏలకు ఉద్యోగోన్నతి కల్పించండి

నందిగాం: వీఆర్‌ఏలకు జీవో 39 మేరకు ఉద్యోగోన్నతి కల్పించాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వై.అప్పలస్వామి డిమాండ్‌ చేశారు. శనివారం నందిగాం తహ సీల్దార్‌ కార్యాలయ ఆవరణలో వీఆర్‌ఏల సమావేశం నిర్వహించారు.  ప్రతీ ఏటా 30 శాతం మేర వీఆర్‌ఏలకు ఉద్యోగోన్నతులు ఇచ్చేవారని, అయితే ఈ ఏడాది ఇప్పటి వర కు పదోన్నతులు ఇవ్వకపోవడం అన్యాయయమన్నారు. సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసరావు, ఎస్‌.సుజాత, మండల ప్రతినిఽధులు భాస్కరరావు, గణపతి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.