మొక్కుబడిగా మున్సిపల్‌ బడ్జెట్‌, సాధారణ సమావేశాలు

ABN , First Publish Date - 2022-01-28T05:25:10+05:30 IST

స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలోని కౌన్సిల్‌ హా లులో గురువారం నిర్వహించిన మున్సిపాలిటీ బడ్జెట్‌, కౌన్సిల్‌ సాధారణ సమావేశాలు మొక్కుబడిగా ముగిసాయి.

మొక్కుబడిగా మున్సిపల్‌ బడ్జెట్‌, సాధారణ సమావేశాలు
డీఎస్పీతో చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి వాగ్వాదం

తాడిపత్రి, జనవరి 27: స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలోని కౌన్సిల్‌ హా లులో గురువారం నిర్వహించిన మున్సిపాలిటీ బడ్జెట్‌, కౌన్సిల్‌ సాధారణ సమావేశాలు మొక్కుబడిగా ముగిసాయి. ఆయా సమావేశాలకు వైస్‌చైర్మన్లు సరస్వతమ్మ, అబ్దుల్‌రహీం అధ్యక్షత వహించారు. చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి ము న్సిపల్‌ కార్యాలయానికి విచ్చేసినా, తన ఛాంబర్‌కే పరిమితమయ్యారు.  2022-23 ఏడాది బడ్జెట్‌ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ప్రతిపాదించిన అంచనాల ప్రకారం రూ.76,67,23000లను కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఆమోదింది. అనంతరం సాధారణ సమావేశం కొనసాగగా, మొత్తం ఎజెండాలోని 8 అంశాలకు కౌన్సిల్‌ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. విశేషమేమంటే రెం డు సమావేశాలనూ కేవలం 20 నిమిషాల్లోనే ముగించారు. ఏఒక్క సభ్యుడూ నోరుమెదపలేదు. ప్రతిపక్ష వైసీపీ కౌన్సిల్‌ సభ్యులు ప్రేక్షకపాత్ర వహించారు.  16 మంది వైసీపీ సభ్యుల్లో పలువురు గైర్హాజరు కావడం కూడా విమర్శలకు తావిస్తోంది. కాగా మున్సిపల్‌ కార్యాలయంలో శుక్రవారం జరిగిన బడ్జెట్‌, సా ధారణ సమావేశాలకు వేర్వేరుగా ఇరువురు వైస్‌చైర్మన్లు అధ్యక్షత వహించేట్లు చేసిన టీడీపీ ము న్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని పలువురు అభిప్రాయపడ్డారు.


నేను వెళ్లిపోతా.. మీరే కౌన్సిల్‌ మీటింగ్‌ జరుపుకోండి

పోలీసులతో మున్సిపల్‌ చైర్మన వాగ్వాదం

మున్సిపల్‌ కార్యాలయంలో ఉన్న పోలీసులను చూసిన చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మీరంతా ఉంటే నేనెందుకు ఇక్కడ? నేను వెళ్లిపోతా.. మీరే జరుపుకోండి అంటూ వారిపై కోపం ప్రదర్శించే ప్రయత్నం చేశా రు. అక్కడే వున్న డీఎస్పీ చైతన్య, తాము కొన్ని సలహాలు ఇవ్వడానికి వచ్చామ ని సర్దిచెప్పే ప్రయత్నంచేశారు. ఇక్కడి నుంచి అందరూ వెళ్లాలని చైర్మన సూ చించారు. ఇదిలావుండగా మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసం సమీపంలో డీఎస్పీ చైతన్యతో పాటు పోలీసు అధికారులు కొద్దిసేపు హంగామా చేశా రు. సీసీ కెమెరాల ఏర్పాటు, ట్రాఫిక్‌ సిగ్నల్‌ పరిశీలన కోసం వచ్చామంటూనే రోడ్డుపై పోయే వారిని అడ్డుకోవడం కనిపించింది.  


కౌన్సిల్‌లో సీఐ ప్రసంగం

మున్సిపాలిటీ పరిపాలన నిర్ణయాలు తీసుకొనే కౌన్సిల్‌ సమావేశంలో పట్టణ సీఐ కృష్ణారెడ్డి మాట్లాడడం పలువురిని ఆశ్చర్యపరిచింది. సమావేశాలు ప్రా రంభం కానుండగా కౌన్సిల్‌ హాలులోకి వచ్చిన సీఐ... చైర్మన కుర్చీ పక్కన ఏర్పాటుచేసిన మైక్‌లో మాట్లాడారు. దీంతో సభ్యులు అవాక్కయ్యారు. పట్టణంలో   ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, దొంగతనాల అడ్డుకట్టకు కౌన్సిల్‌ సభ్యులు సహకరించాలని సీఐ కోరారు. పట్టణంలో పర్యటించే సమయంలో టీడీపీ, వైసీపీ నాయకులు, మద్దతుదారులు తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. శాంతిభద్రతల నియంత్రణ చర్యలకు సహకరించాలన్నారు.


నిధులున్నా ఖర్చు చేసే స్వేచ్ఛ లేదు : చైర్మన 

మున్సిపాలిటీలో నిధులున్నా ఖర్చుచేసే స్వేచ్ఛ లేదని టీడీపీ మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మున్సిపల్‌ కార్యాలయంలోని తన చాంబర్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మున్సిపాలిటీకి కోట్లాది రూపాయల నిధులు ఉన్నాయన్నారు. సీఎ్‌ఫఎంఎస్‌ అనుమతి లేకపోవడంతో ఖర్చుచేయలేకపోతున్నామన్నారు. వివిధ పనులకు సంబంధించి పెద్దఎత్తున బిల్లు లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కౌన్సిల్‌ సభ్యులు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలకు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వడం శుభపరిణామమన్నారు. వైసీపీ సభ్యుల సహకారం వల్లే సమావేశాలు, కౌన్సిల్‌ ఎజెండాలోని అంశాలు ఏకగ్రీవంగా తీర్మానం అవుతున్నాయన్నారు. 


Updated Date - 2022-01-28T05:25:10+05:30 IST