కరోనాను ఎదుర్కొనే ప్రోటీన్
ABN , First Publish Date - 2020-05-27T07:29:21+05:30 IST
కరోనా, డెంగ్యూ, హెచ్‌ఐవీ వ్యాధులలోని వైర్‌సను సమర్థంగా ఎదుర్కొనే రెండు రకాల బ్యాక్టీరియా ప్రోటీన్లను అమెరికా, చైనా
బీజింగ్ మే 26: కరోనా, డెంగ్యూ, హెచ్‌ఐవీ వ్యాధులలోని వైర్‌సను సమర్థంగా ఎదుర్కొనే రెండు రకాల బ్యాక్టీరియా ప్రోటీన్లను అమెరికా, చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈడెస్ ఈజిప్ట్ దోమల నుంచి ఈ ప్రోటీన్లను సేకరించారు. ఈ రెంటిలో లిపేస్ డొమైన్ ఉంటుంది. ఇవి శక్తిమంతమైన యాంటీ వైరల్ చర్యను కలిగి ఉన్నాయని వీరి పరిశోధనల్లో తేలింది. ఈ విషయాలు ఈ నెల 22న బయోరిస్కివ్ పరిశోధన పత్రంలో ప్రచురితమైనట్లు గ్లోబల్ టైమ్స్ పత్రిక మంగళవారం వెల్లడించింది.