Advertisement
Advertisement
Abn logo
Advertisement

బీజేపీ విధానాలను నిరసించండి

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌ గంధం వెంకటరావు

కూర్మన్నపాలెం, జూలై 17: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌ గంధం వెంకటరావు పిలుపునిచ్చారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు నిరసనగా కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 292వ రోజు కొనసాగాయి. మంగళవారం ఈ దీక్షలలో ఎస్‌ఎంఎస్‌-2 కార్మికులు కూర్చున్నారు. ఈ శిబిరంలో వెంకటరావు మాట్లాడుతూ నష్టాల సాకుతో కేంద్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు నిర్ణయించడం తగదన్నారు. ఏఐటీయూసి జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ మాట్లాడుతూ ప్రజా సంపద ఉక్కు పరిశ్రమను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే అధికారం ఎవరికీ లేదన్నారు. ఈ శిబిరంలో అప్పారావు, రమణమూర్తి, మరిడయ్య, రామరాజు, శ్రీధర్‌, వి.ప్రసాద్‌, గంగవరం గోపి తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement