బొబ్బిలిలో నిరసన హోరు

ABN , First Publish Date - 2021-10-21T04:48:26+05:30 IST

వైసీపీ దాడులను నిరసిస్తూ టీడీపీ ఇచ్చిన పిలుపు మేరకు బొబ్బిలిలో బుధవారం ఆ పార్టీ శ్రేణులు నిరసన గళాన్ని గట్టిగా వినిపించాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి బేబినాయన, తెంటు లక్ష్మునాయుడు, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు రాంబార్కి శరత్‌, అల్లాడ భాస్కరరావు, రౌతు రామ్మూర్తి, గెంబలి శ్రీనివాసరావు, కాకల వెంకటరావు తదితరులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

బొబ్బిలిలో నిరసన హోరు
బొబ్బిలి: అరెస్టు అయిన టీడీపీ నాయకులు

బొబ్బిలి రూరల్‌, అక్టోబరు 20: వైసీపీ దాడులను నిరసిస్తూ టీడీపీ ఇచ్చిన పిలుపు మేరకు బొబ్బిలిలో బుధవారం ఆ పార్టీ శ్రేణులు నిరసన గళాన్ని గట్టిగా వినిపించాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి బేబినాయన, తెంటు లక్ష్మునాయుడు,  పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు రాంబార్కి శరత్‌, అల్లాడ భాస్కరరావు, రౌతు రామ్మూర్తి, గెంబలి శ్రీనివాసరావు, కాకల వెంకటరావు తదితరులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. తొలుత సీఐ శోభన్‌బాబు, ఎస్‌ఐలు జ్ఞాన ప్రసాద్‌, సూర్యనారాయణ బొబ్బిలి కోట వద్దకు చేరుకుని పార్టీ నాయకులను బయటకు రాకుండా నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ దశలో పోలీసులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కోటకు అత్యంత సమీపంలోని ఎన్టీఆర్‌ విగ్రహం ముందు శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని బేబినాయన, తెంటులు నచ్చజెప్పినప్పటికీ సీఐ శోభన్‌బాబు ససేమిరా అన్నారు. అయినప్పటికీ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా ఎన్టీఆర్‌ విగ్రహం వరకు నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా వెళ్లారు. అంతలో పోలీసులు వాహనాలను రప్పించి నాయకులు, కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.  35 మంది నాయకులను అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో ఏగిరెడ్డి శ్రీధర్‌, పువ్వల మాధవరావు,  నంది హరిప్రకాశ్‌, చింతాడ రవి, ఎక్కుడు వాసు, సుంకరి సాయి రమేష్‌, బొద్దాన అప్పారావు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-21T04:48:26+05:30 IST