విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై నిరసన

ABN , First Publish Date - 2021-03-04T05:12:07+05:30 IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ శుక్రవారం జరిగే బంద్‌ జయప్రదం చేయాలని ఉక్కు పరిరక్షణ సమితి నాయకులు పిలుపునిచ్చారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై నిరసన
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న పరిరక్షణ సమితి

భీమవరం అర్బన్‌, ఫిబ్రవరి 3: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ శుక్రవారం జరిగే బంద్‌ జయప్రదం చేయాలని ఉక్కు పరిరక్షణ సమితి నాయకులు పిలుపునిచ్చారు. ప్రకాశంచౌక్‌లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జేఎన్‌వీ.గోపాలన్‌, సీపీఐ, సీపీఎం జిల్లా నాయకులు చెల్లబోయిన రంగారావు, కే.రాజారామ్మోహన్‌రాయ్‌ మాట్లాడుతూ విశాఖ ఉక్కు నష్టాలకు పాలకులే బాధ్యత వహించాలన్నారు. ఎం.సీతారాం ప్రసాద్‌, మల్లేశ్వరరావు, అకలి రాము, బి.వాసుదేవరావు, ఆంజనేయులు, శ్రీవిజ్ఞాన వేదిక కో కన్వీనర్‌ చెరుకువాడ రంగసాయి, గంటా సుందర్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.


రేపు బంద్‌ విజయవంతం చేయాలి


మొగల్తూరు: విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ వ్యతిరే కిస్తూ శుక్రవారం రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ సీఐ టీయూ ఆధ్వర్యంలో బుధవారం మొగల్తూరులో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు తెలగంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటుపరం చేస్తే లక్షలాది మంది కార్మికుల జీవనం ప్రశ్నా ర్ధకం అవుతుందన్నారు. ఆంధ్రులంతా సమ్మెకు మద్దతుగా నిలవాలన్నారు. ర్యాలీలో కంచర్ల సోని, ఆదూరి సాంబమూర్తి, కొత్తపల్లి గోవిందరాజులు, నాగరాజు, వీరా పాండు రంగారావు, జట్టు కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-04T05:12:07+05:30 IST