అడిగిన వారందరికీ ‘ఉపాధి’ పని కల్పించండి

ABN , First Publish Date - 2020-05-12T10:05:17+05:30 IST

కోవిడ్‌కారణంగా ప్రతి గ్రామంలో సాధారణ ప్రజలతో పాటు ఆర్థికంగా ఉన్నవాళ్ళు, ఉన్నత చదువులు చదువుతున్న వారు కూడా

అడిగిన వారందరికీ ‘ఉపాధి’ పని కల్పించండి

రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 


కరీంనగర్‌, మే 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కోవిడ్‌కారణంగా ప్రతి గ్రామంలో సాధారణ ప్రజలతో పాటు ఆర్థికంగా ఉన్నవాళ్ళు, ఉన్నత చదువులు చదువుతున్న వారు కూడా ఉపాధిహామీ పనులకు వస్తున్నారు. అలా వచ్చి వారందరికీ జాబ్‌కార్డులు జారీ చేసి ఉపాధి హామీ పనులు కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు.


సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. గ్రామంలో అడిగిన వారందరికీ జాబ్‌ కార్డు ఇచ్చి వారికి పని కల్పించాలని  అన్నారు. అదే విధంగా పెరిగిన వేతనం పడేటట్లు చూడాలని అన్నారు. ఇంకుడు గుంతలు, చెరువు నుంచి పంట పొలాలకు వెళ్లికాలువలు, ఎస్సారెస్పీ డిస్ట్రిబ్యూషన్‌ కాలువలను గుర్తించి ఉపాధి హమీ పనులు చేపట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, డీఆర్డీఏ వెంకటేశ్వర్‌రావు, జడ్పీ సీఈవో వెంకటమాధవరావు, జిల్లా పంచాయతీరాజ్‌ అధికారి రఘువరన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-05-12T10:05:17+05:30 IST