పక్కదారి పట్టిన పీడీఎస్‌ బియ్యం

ABN , First Publish Date - 2022-01-24T06:08:25+05:30 IST

పేదలకు ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వాలు పేదలకు అందిస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పడుతోంది.

పక్కదారి పట్టిన పీడీఎస్‌ బియ్యం

విస్సన్నపేట, జనవరి 23: పేదలకు ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వాలు పేదలకు అందిస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పడుతోంది. కొంతమంది అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్నా యి. ప్రతి కార్డుదారుడికి 5 కిలోల చొప్పున కిలో కేవ లం రూపాయికే రేషన్‌ దుకాణాలు, ఎమ్‌డీయూ ద్వారా ప్రభుత్వాలు పీడీఎస్‌ బియ్యాన్ని సరఫరా చే స్తుంది. సదరు కార్డుదారులు బియ్యానికి బదులు కిలో రూ.8లకు డీలర్లకు ఎమ్‌డీయూ వాహనాల వా ళ్లకే విక్రయిస్తున్నారు. ఇలా సేకరించిన బియాన్ని ఆ టోల్లో అక్రమంగా తరలించి లారీల్లో జిల్లాలు దాటిం చి కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత రేషన్‌ బియ్యాన్ని మండలంలోని కొన్ని కోళ్ల ఫారాలు, రైస్‌ మిల్లుల్లో నిల్వ చేస్తున్నారు. మండలంతో చుట్టుపక్క గ్రామాల్లో పీ డీఎస్‌ బియ్యాన్ని నూజివీడు మండలానికి చెందిన ఒక వ్యాపారి చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. అ తనిపై పలుమార్లు పీడీఎస్‌ అధికారులు కేసులు నమోదు చేసినా మార్పు రాలేదు. గ్రామాలు, పోలీ్‌సస్టేషన్లు, తహసీల్దార్‌ కార్యాలయాలు, చెక్‌పోస్టులు దాటి బియ్యం లోడుతో లారీలు తమ గమ్యస్థానాని కి ఎలా చేరుకుంటున్నాయో సామాన్య ప్రజలకు వే యి డాలర్ల ప్రశ్నగా కనిపిస్తోంది. ఇలా పీడీఎస్‌ మాఫియా యథేచ్ఛగా సాగుతున్నా అధికార పార్టీ నేతలకు తెలియకుండా ఉంటుందా అని సామాన్య ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. మండలంలోని కొంత మందివ్యక్తులు రాత్రి వేళల్లో వాహనాలు నిలిపి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు సామాజిక మాధ్యమాలు, దిన పత్రికలో వార్తలు వచ్చాయి. ఈవిషయంపై తహసీల్దార్‌ బి.మురళీకృష్ణను వివరణ కోరగా పూర్తిస్థాయిలో విచారణ చేసి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2022-01-24T06:08:25+05:30 IST