యాసంగిలో పప్పుదినుసు పంటలు వేయాలి

ABN , First Publish Date - 2021-12-08T03:56:37+05:30 IST

యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన పప్పు, నూనె దినుసు పంటలు సాగు చేయాలని ఆయా మండలాల్లో వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించారు.

యాసంగిలో పప్పుదినుసు పంటలు వేయాలి
దహెగాంలో క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న వైద్యాధికారులు

దహెగాం/రెబ్బెన/సిర్పూర్‌(టి)/బెజ్జూరు, డిసెంబరు 7: యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన పప్పు, నూనె దినుసు పంటలు సాగు చేయాలని ఆయా మండలాల్లో వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించారు. దహెగాంలో ఏవో రామకృష్ణ, ఏఈవోలు శోభన్‌, దీపక్‌, సీఈవో బక్కయ్య, రెబ్బెన మండలంలోని రాజారాం గ్రామంలో ఏఈవో సుకన్య, సిర్పూర్‌(టి) మండలంలోని మెట్‌ పల్లి, రావన్‌పల్లి గ్రామాల్లో ఏఈవో నేహాతబస్సుం, ఏవోలు కవిత, శ్రీనివాస్‌, శోభ, బెజ్జూరు మండ లంలోని కుశ్నపల్లి, కుకుడ, అంబగట్‌, పోతెపల్లి, ముం జంపల్లి, బారెగూడ గ్రామాల్లో ఏడీఏ రాజుల నాయుడు, ఏఈవోలు రవితేజ, శ్రీధర్‌, మారుతి రైతు లకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయా మండలాల్లో వ్యవసాయశాఖ 2022సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు.

Updated Date - 2021-12-08T03:56:37+05:30 IST