గుమ్మడికాయ చిత్రాలు!

ABN , First Publish Date - 2021-09-07T05:30:00+05:30 IST

ఇక్కడ కనిపిస్తున్న బొమ్మలు చాలా అందంగా ఉన్నాయి కదూ! అవి

గుమ్మడికాయ చిత్రాలు!

ఇక్కడ కనిపిస్తున్న బొమ్మలు చాలా అందంగా ఉన్నాయి కదూ! అవి ఎలా మలిచారో తెలుసా? గుమ్మడికాయలను చెక్కి అందమైన బొమ్మలుగా మలిచారు. బల్గేరియాకు చెందిన ఏంజెల్‌ బొరలివ్‌ అనే ఫుడ్‌ ఆర్టిస్టు ప్రతిభ ఇది. ఇతని చేతికి గుమ్మడికాయ దొరికితే చాలు అందమైన బొమ్మగా మారిపోతుంది. 


ఏంజెల్‌ హోటల్స్‌, రెస్టారెంట్లలో నిర్వహించే ఈవెంట్లలో ప్రదర్శన కోసం రకరకాల ప్రతిమలు తయారుచేసి ఇస్తుంటారు. ఏడేళ్ల క్రితం గుమ్మడికాయను అందమైన పక్షులుగా మలచడం ప్రారంభించాడు. వాటిని చూస్తే నిజమైన పక్షులేమోనని అనుకుంటారు. గుమ్మడికాయలే కాదు పుచ్చకాయలను కూడా బొమ్మలుగా మలుస్తుంటాడు. అతడి ప్రతిభను చూసిన వారు హ్యాట్సాఫ్‌ చెప్పకుండా ఉండలేరు. 

Updated Date - 2021-09-07T05:30:00+05:30 IST